పోస్ట్‌లు

*జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి*

చిత్రం
*60:40 శాతం నిష్పత్తిని సవరించాలి* *నగరానికి చేరువగా స్థలాలు కేటాయించాలి* *ఈ ఏడాది అక్రెడిటేషన్ లేనివారికి న్యాయం చేయాలి* *విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకార్యవర్గసమావేశం తీర్మానం* విశాఖపట్నం,2024,జనవరి 25,టుడే న్యూస్ : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను  వేగవంతం చేయాలని విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ అధ్యక్షతన సొసైటీ కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై  కార్యవర్గ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే నగరానికి చేరువగా స్థలాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రభుత్వం ఇళ్ల స్థలాల జీవోలో పేర్కొన్న విధంగా 60:40 నిష్పత్తిని సవరించాలని కోరారు. ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల వాటాగా చెల్లించాల్సి మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని కోరారు. అదేవిధంగా సొసైటీలో సభ్యులుగా ఉన్నవారిలో 250 మంది వరకూ 2023

*జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం*

చిత్రం
విశాఖపట్నం,2024, జనవరి 24,టుడే న్యూస్ : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన విషయం విదితమే. అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్  ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందచేశారు.

సింహాచలంలో వరుణయాగం

చిత్రం
  *పవిత్ర జలాలతో త్రిపురాంతకస్వామి కి అభిషేకం*  సింహాచలం,2023 నవంబరు 29 , టుడే న్యూస్ : రాష్ట్రము లో సమృద్దిగా వర్షాలు కురవాలని సింహగిరి పై వరుణ యాగం అత్యంత వైభవంగా చేపట్టారు.. ఈ మేరకు బుధవారం, సింహాచలేశుని ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు.ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం జరిపించారు. వైదికులంతా గంగధారకు వెళ్లి పవిత్ర జలాలను తీసుకువచ్చి మూలవిరాట్ నీ అభిషేకించారు. స్వామివారికి అర్చన చేసి వైదికులు, అధికారులు మరోసారి గంగధారకు వెళ్లి  పూర్ణకలశతో ప్రకృతి జలాలను తీసుకువచ్చి త్రిపురాంతకుడ్ని అభిషేకం చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు.కార్యక్రమంలో ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఈ యాగము తో విస్తారము గా వర్షాలు కురవాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు..అంతే కాకుండా కార్తీక మాసం లో వరుణ యాగం చేపట్టడం ఎంతో శుభ పరిణామం అన్నారు..త్రిపురాంతక స్వామి ఆలయం లో జరిగే అన్ని ఉత్సవాలు లో భక్తులును మరింతగా బాగ స్వామ్యము చేయాలన్నారు.. అయా పూజా కార్య క్రమాలు లో ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, బయ్యవరపు రాధ,ఏ ఈ ఓ లు పి నరసింగరావు, నా

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వ సహాయం

చిత్రం
విశాఖపట్నం,2023 నవంబర్ 23,టుడే న్యూస్ :   విశాఖపట్నం జడ్పీ లో షిప్పింగ్ హార్బర్ లో జరిగిన బోటు అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వ సహాయ నిధి కింద 7 కోట్ల, 11 లక్షల రూపాయల చెక్కును బాధితులకు అందజేసిన  ప్రాంతీయ సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి మరియు మత్స్యకార శాఖ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు .. వారితోపాటు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ , విశాఖపట్నం ఎంపీ ఎం వి వి సత్యనారాయణ , పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు డిసిసిబి చైర్మన్ కోలా గురువులు , ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు ఉన్నారు .

ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు చేయండి

చిత్రం
సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణకు విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వినతి విశాఖపట్నం, 2023,నవంబర్ 22, టుడే న్యూస్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన జీవో ను సవరించాలని కోరుతూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు  విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. జీవో నంబర్ 535/2023లో ఉన్న కొన్ని నిబంధనలు కారణంగా అత్యధిక శాతం మంది జర్నలిస్టులు ఎటువంటి లబ్ది పొందలేరని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఒక ప్రైవేట్ హోటల్ లో బుదవారం  ఆయనను కలిసిన సొసైటీ ప్రతినిధులు జీవోలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టుల ఆర్దిక పరిస్థితి రీత్యా 60 : 40 ప్రాతిపదికన రూపొందించిన నిబంధనను అందరికీ అనువుగా ఉండేలా 90:10 నిష్పత్తిలో చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భార్య పేరున గాని భర్త పేరున గాని ఇళ్ల స్థలం, ఫ్లాట్ ,ఇల్లు ఉంటే అనర్హులని ప్రకటించడం వలన ఎనభై శాతానికి పైగా జర్నలిస్టులు నష్టపోతారని వివరించారు. ఈ నిబంధనను  తొలగించేలా కృషి చేయాలని కోరారు.2023లో అక్రిడేషన్ లేని జర్న

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

చిత్రం
* ఎస్ సి విభాగం జోనల్ ఇంచార్జి అల్లంపల్లి రాజబాబు * విశాఖపట్నం,,2023 నవంబర్6, టుడే న్యూస్:      ,దళితుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసిపి ఎస్ సి విభాగం జోనల్ ఇంచార్జి అల్లంపల్లి రాజబాబు పేర్కొన్నారు. ఎండాడ లా కాలేజీ రోడ్డులో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరేటి మహేష్ అనే వ్యక్తి యువతను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి దళితులు రాజీనామా చేయాలని మహేష్ వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. ఏయూలో చదువు కోసం వచ్చిన మహేష్ దళిత నాయకుడిగా ఎదిగి దళితులనే విమర్శించే స్థాయికి రావడం సిగ్గుచేటు అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేస్తున్న పార్టీ వైసీపీ అన్నారు. అటువంటి పార్టీని, నాయకులను విమర్శించే స్థాయి మహేష్ కి లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులందరికీ సముచిత న్యాయం దక్కుతుందన్నారు. మంత్రివర్గంలో కూడా దళితులకు ముఖ్య శాఖలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మహేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు దళితులకు అ

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*

విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్‌–1 కార్యాలయం ఇంటెలిజెన్స్‌ విభాగంలో జీఎస్టీ అధికారులు బి.మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.వి.చలపతి, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణలను పోలీస్‌ కస్టడీకి తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తెలిపారు. నలుగురు ఉద్యోగులు విధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు రాష్ట్ర పన్నులశాఖ కార్యాలయం డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31వ తేదీన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల్ని విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులు నలుగురికి రిమాండ్‌ విధించిందన్నారు. నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోని పలు రికార్డులను తారుమారు చేశారని, ఈ అవినీతిలో మరి కొందరు అధికారుల పాత్రపై విచారించాల్సి ఉన్నందున నిందితులను తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. న్యాయాధికారి ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నలుగురు ఉద్యోగులను పోలీస్‌ కస్టడీకి తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు.

ఘనంగా మాడుగుల కేజే.పురం శ్రీ సంతోషిమాత తీర్థ మహోత్సవం

చిత్రం
మాడుగుల,2023 ఫిబ్రవరి26,టుడే న్యూస్: మాడుగుల మండలంలో కేజే పురం జంక్షన్లో కొలువైన శ్రీ సంతోషిమాత అమ్మవారి తీర్ధ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లి నాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ నిర్వహించారు. అమ్మవారి తీర్ధం పురస్కరించుకొని గోపూజ, అమ్మవారికి అర్చనలు, కుంకుమ పూజలు, విశేష అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు, మొక్కబడులు సమర్పించుకున్నారు. మధ్యాహ్నం సుమారు ఆరు వేల మంది భక్తులకు అన్న సమారాధనలో పాల్గొన్నారు. సాయంత్రం తీర్థం మహోత్సవంలో జబర్దస్త్ ఆర్టిస్టులతో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమం, సాంసుకృతిక కార్యక్రమాలు, చిటికెల భజనలు, కొలాటాలు, చూపరులను ఎంత గానో అలరించాయి. ఈ తీర్ద మహోత్సవానికి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మంత్రి  కుమార్తె అనురాధ, పైలా ప్రసాద్, విజయనగరం డిఎస్పి వేగి వెంకట అప్పారావు, పలువురు ప్రముఖులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదములు స్వీకరించారు.

పబ్లిక్ రిలేషన్స్ సోసైటి ఆఫ్ ఇండియా, విశాఖపట్నం చాప్టర్

చిత్రం
  విశాఖపట్నం, 26 పిబ్రవరి, 2023, టుడే న్యూస్ : జి20 సమావేశాలతో పెరగనున్న భారత ప్రతిష్ఠ పి.ఆర్.ఎస్.ఐ. సమావేశంలో ఆర్థిక నిపుణులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు , అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రపంచ ఆర్థిక గమనంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశం త్వరలో ఆతిద్యం ఇవ్వనున్న జి20 సమావేశాల ద్వారా తన ప్రతిష్ఠ ను మరింతగా పెంచుకోనున్నదని ప్రముఖ ఆర్థిక మరియు అంతర్జాతీయ నిపుణురాలు, గీతం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధా రఘరామ పాత్రుని పేర్కొన్నారు. భారత ప్రజాసంబంధాల  సంఘం (పి.ఆర్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో ఆదివారం తేది.26.02.2023న ( దశపల్లా  హోటల్,  సూర్య భాగ్) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి20 భారతదేశ పాత్ర అవకాశాలు అనే అంశంపై ఆమె ప్రసంగించారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్దం వంటి అంశాల వల్ల ఆహర, ఇంధన సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని ఈ స్థితిలో అటు సంపన్న దేశాలతో ఇటు వర్థమాన దేశాలతో సత్సంబంధాలు ఉన్న భారతదేశం నుంచి ప్రపంచం చాలా ఆశిస్తోందన్నారు. జి20 దేశాల మధ్య గల విభేదాల వల్ల కూటమి పై సన్నగిల్లిన విశ్వసనీయతను ఈ ఏడాది దేశంలో జరిగే సమావేశాల ద్వారా భారతదేశం పునరుద్దరించాల్సి ఉందని ఆమె అభిప్రాయ

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు

చిత్రం
*55వార్డులో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో - కె.కె రాజు  అక్కయ్యపాలెం,2023 ఫిబ్రవరి 11, టుడే న్యూస్:గడ  పగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు ధర్మానగర్ సచివాలయం 1086261 దర్మానగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్  కె.కె రాజు  55వార్డు కార్పొరేటర్ కె.వి.యన్ శశికళతో కలిసి పర్యటించారు. ముందుగా ధర్మా నగర్  అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి   అనంతరం ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా కె.కె రాజు  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లా ముందుకు సాగుతున్నారని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,వార్డు అధ్యక్షులు కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,డైరెక్టర్లు నూకరాజు,రాయుడు శ్రీను, 55వార్డు నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్,సొండి సురేష్,కరుణ,లక్ష