కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్






 :   

  హైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్: ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ ప్రముఖులు సిదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలకు ఓటమి తప్పదన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం ఎంపీగా విజయం సాధిస్తారన్నారు. అయితే ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ నాయకులు భూములు భారీగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ లక్షా పదివేల ఓట్ల మేజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కూటమికి సినిమా ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా వాళ్లు ముందుకు రావాలని ఈ సందర్బంగా నట్టి కుమార్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా సీని పరిశ్రమలోని వారికి సూచించారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ దుర్మార్గాలను ఆయన చెల్లెళ్లు వైయస్ షర్మిల, సునీత నర్రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.విజయమ్మ మాత్రం వైయస్ జగన్ గురించి ఎందుకు, ఏమీ మాట్లాడడం లేదంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అధికార వైసీపీ రౌడీయుజాన్ని అరికట్టాలని ఎన్నికల కమిషన్‌కు ఈ సందర్భంగా నట్టి కుమార్ విజ్జప్తి చేశారు. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలను భరించాలంటే కేంద్ర దళాలు అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం సినిమా వాళ్లు.. సోషల్ మీడియాలో అయినా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని నట్టి కుమార్ పేర్కొన్నారు.






ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం