పోస్ట్‌లు

*భక్తులకు ఆరు రోజులు దర్శనాలుండవు*

   సింహాచలం దేవస్థానం:   శ్రీశ్రీశ్రీ     వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో  ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని ఈఓ సూర్యకళగారు నిర్ణయించారు.  ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం... చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యేం దృష్యా ఈ నిర్ణయం తీసుకోవడమైనది. భక్తులకు అనుమతిలేకపోయినా... స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే జరపబడును. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదు. 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవడమైనదని గుర్తించి...అందరూ సహకరించాలని ఈఓ సూర్యకళగారు కోరారు.

*తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?: నారా లోకేశ్*

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఆ హామీని నెర‌వేర్చ‌ట్లేద‌ని, అంతేగాక, సొంత బ్రాండ్‌ను అమ్మిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 'ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధం చేస్తామంటిరి క‌దా వైఎస్ జ‌గ‌న్ గారు.. దశ‌ల‌వారీగా మ‌ద్యం అమ్మ‌కం వేళ‌లు మారుస్తూ..  తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?' అని లోకేశ్ విమ‌ర్శించారు. 'క‌రోనా మందుల్లేక ప్రాణాలు పోతున్నాయంటే, నా సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడ‌ల్‌ తాగమంటున్న‌ట్టుంది మీ ఎవ్వారం.  బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం' అని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు

చిత్రం
  ఫొటో క్యాప్షన్, 17వ శతాబ్దంలో హబ్సీలు నిర్మించిన ఒక చెరువు పెయింటింగ్‌ హైదరాబాద్‌లోని హబ్సిగూడ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈశాన్య ఆఫ్రికాకు చెందిన హబ్సీ తెగ ప్రజలు హైదరాబాద్ పాలకుల వద్ద కూలీలుగా, పశువుల కాపర్లుగా పనిచేసేందుకు వలస వచ్చి ఇక్కడే ఉండిపోయారు. దీంతో అది హబ్సిగూడ అయ్యింది. హైదరాబాద్‌లోని బార్కాస్ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ హబ్సీలున్నారు. శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారంతా ఇప్పుడు హైదరాబాదీలయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు భారత్‌లోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఆఫ్రికా ప్రజల ముద్ర ఉంది. ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలను వారు పాలించారు కూడా. ఫొటో సోర్స్, RAJA DEEN DAYAL ఫొటో క్యాప్షన్, 1904వ సంవత్సరంలో హైదరాబాద్‌లో.. గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తన పరివారంతో వెళ్తున్న చిత్రం. ఆయన అంగరక్షకుల్లో ఆఫ్రికన్లను చూడొచ్చు. ఆఫ్రికా, భారత్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు. వాణిజ్యం, సంగీతం, కళలకు సంబంధించి రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక బదిలీ జరిగినట్లు చరిత్ర చెప్తోంది. కానీ, విభిన్నమైన ఈ రెండు ప్రాంతాల చారిత్రక సంబంధాలపై పెద్దగా చర్చ జరగలేదు. నిజానికి ఆఫ్రికా ఖండం నుంచి

మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...

చిత్రం
  విశాఖపట్నం:  నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో. విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది? గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువానిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం... జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. చెక్ పోస్టు పడతాది... జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభువానిపాలెం వెళ్లాలన్నా... వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్

అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్

చిత్రం
  దేశ రాజధానిలో కోవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై దిల్లీ హైకోర్ట్ తమకు జారీ చేసిన కోర్టు ధిక్కార నోటీసులపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ కేసును జస్టిస్ డి.చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతోందని, నిన్న కూడా 585 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ‘ధిక్కారం కేసు పెట్టి అధికారులను జైళ్లలో పెట్టడం వల్ల ఆక్సిజన్ రాదు. కానీ, దానికోసం మీరు ఏమేం చేయగలరో మాకు చెప్పండి’ అని కోర్టు ఆయన్ను అడిగింది. ‘ఆక్సిజన్ కొరత వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనడంలో, ఇది అత్యవసర స్థితి అనడంలో ఎలాంటి వివాదం లేదని, కానీ దానికోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింద’ని జస్టిస్ షా కూడా అడిగారు. సమాధానంగా సొలిసిటర్ జనరల్... "మొదట 5 వేల టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అందులో పారిశ్రామిక ఆక్సిజన్ కూడా ఉంది. మొదట్లో మెడికల్ ఆక్సిజన్‌కు అంత డిమాండ్ లేదు. దాంతో, మేం పారిశ్రామిక ఆక్సిజన్ వినియోగాన్ని ఆపేశాం. అలా చాలా మందికి సాయం అంద

ఇంట్లోనూ మాస్క్ ధరించడం వల్ల ఫలితం ఉంటుందా.. 24 గంటలూ మాస్క్ ధరించడం సాధ్యమేనా ???

చిత్రం
  ఫొటో క్యాప్షన్, ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడిందా ? ''ఇంట్లో కూడా మాస్క్ ధరించే సమయం వచ్చేసింది'' అని నీతీ ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వి.కె.పాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లతో ఇంట్లో కూడా వైరస్ నుంచి మనుషులకు రక్షణ లేదా అన్న చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలిన వాళ్లు మాస్క్ ధరించాలనడం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికీ వైరస్ లేకపోయినా ఇంట్లో కూడా ముక్కు, నోరు కవర్ చేసుకోవాల్సి రావడం అవసరమేనా? ఈ సలహా ఉపయోగకరమైనదేనా? ఇంట్లో మాస్క్ ధరించడం గురించి తెలుసుకోవడానికి కొంతమంది నిపుణులతో బీబీసీ మాట్లాడింది. దీంతో పాటు కోవిడ్‌కు సంబంధించిన అనేక అంశాలపై వారితో చర్చించింది. ఇంట్లో కూడా మాస్కు ధరించడం వల్ల నష్టం ఏమీ లేదన్నారు వైద్య నిపుణులు. ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, కుటుంబాలకు కుటుంబాలనే చుట్టేస్తుండటంతో ఇది కొంత వరకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ''మనది జనాభా ఎక్కువగా ఉన్న దేశం. చాలా నగరాల్లో కుటుంబాలు ఓకే ఇంట్లో లేదంటే ఒకే గదిలో కలిసి ఉంటుంటాయి. అలాంటి వారు ఈసారి త్వరగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది'' అన