వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్న భువనేశ్వరి

 



విశాఖపట్నం,2024, మే 8,టుడే న్యూస్:

*ప్రజలతో మమేకమవుతూ...ప్రజల్లో ఒకరిగా ముందుకు సాగుతున్న భువనమ్మ*

కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

గ్రామ గ్రామాన భువనేశ్వరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు.

పార్టీ కార్యకర్తలు పూలమాలలు, పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు.

రామకుప్పం మండలంలోని రామకుప్పం, బందార్లపల్లి, నెర్నెల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని భువనేశ్వరి పూర్తి చేశారు.

గ్రామస్తులను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగిస్తూ, వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు.

ఓటు విలువను ప్రజలకు అర్థమయ్యేలా భువనేశ్వరి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

వైసీపీ ఐదేళ్ల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్న భువనేశ్వరి.

ప్రజా ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుప్పం ప్రజలను చైతన్యపరుస్తున్న భువనేశ్వరి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం