చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన: సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులుహైదరాబాద్,2024, మే 8,టుడే న్యూస్:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు*  సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం నాడు కలిసి మద్ధతు తెలిపారు.. ఈ సందర్బంగా బోర్డు ప్రెసిడెంట్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ... గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధుతుగా నిలిచామని గుర్తు చేశారు. సక్యులరిజానికి చంద్రబాబు నాయుడు ఐకాన్ గా నిలిచారని అన్నారు. మత సామర్యాన్ని కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సామాజిక సమతుల్యాన్ని చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తున్నారు. ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాలు అభివృద్ధికి సాధ్యమన్నారు. 2024 టీడీపీ మేనిఫెస్టో మైనారిటీ వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుంది. ముస్లీంల అభివృద్ధికి తోడ్పడే మేనిఫోస్టోని ప్రకటించిన టిడిపికి అభినందనలు తెలిపారు.  లాల్ జాన్ భాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ముఫ్తీలు, ఉలేమాలు, మత పెద్దలు వంటి వారితో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సత్సంబంధాలున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మా ఆర్గనైజేషన్ ద్వారా సాయశక్తుల కృషి చేస్తాం.  ఆంధ్రరాష్ట్రంలో ఉన్న ముస్లిం... సోదర సోదరీమణులు అందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*