అమర్నాథ్ కు మద్దతు తెలిపిన మత్స్యకారులు గంగవరం లో భారీ బైక్ ర్యాలీ
అక్కయ్యపాలెం,2024, మే 8, టుడే న్యూస్ : గాజువాక నియోజకవర్గం లో కీలక ప్రాంతమైన గంగవరం మత్స్యకారులు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు పూర్తిగా మద్దతు ప్రకటించారు. బుధవారం సాయంత్రం 64 వార్డ్ అధ్యక్షులు ధర్మాల శ్రీను,85 వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపత్రుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ జరిగింది.ఈ ర్యాలీ 64వ వార్డ్ గంగవరం జంక్షన్ నుండి గాంధీ విగ్రహం మీదుగా యాతపాలెం మీదుగా 64 వా వార్డ్ మస్జిద్ మీదుగా సాగింది.
సుమారు 500 మోటార్ బైక్లతో మంత్రి అమర్నాథ్ రోడ్ షో నిర్వహించారు. దీనికి అపూర్వ స్పందన లభించింది. గంగవరంలో ప్రతి ఇంటి నుంచి జనం బయటకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమర్నాథ్ ను గెలిపిస్తామంటూ మత్స్యకార సంఘం నాయకులు భరోసా ఇచ్చారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ర్యాలీలో యువతతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం.
అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారిని గౌరవంగా చూసుకున్నారని దాన్ని గుర్తుంచుకొని ఏకపక్షంగా మత్స్యకారులంతా వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు అడుగడుగున అవమానం ఎదురైందని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులు హుందాగా జీవించారని ఆయన తెలియజేశారు.
ఈ బైక్ ర్యాలీ లో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకట రామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, గాజువాక ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి,