హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త - మానవత్వo



*అనాధ శవం - టూ వీలర్ పై మృతదేహం స్మశాన వాటికకు తరలింపు* 

అక్కయ్యపాలెం,2024, మే 7,టుడే న్యూస్:  విశాఖ మహానగరం పరిధిలోని కొత్త గాజువాక ప్రాంతం.. హిమాచల్‌నగర్‌కు వెళ్లే రహదారి అది... రోడ్డు పక్కనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి, విగత జీవిగా పడి ఉన్నాడు. వయసు దాదాపుగా 50 కి పైనే ఉంటుంది. గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటూ యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండీ ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ బి నారాయణ అక్కడకు వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు.

ప్రైవేట్ అంబులెన్స్, తోపుడు రిక్షా, సాయం కోసం ఎదురుచూశారు. కానీ ఎవరో ముందుకు రాలేదు. గంటలకొద్దీ వేచి చూసినా.. ఎవరు కనికరించలేదు. చలించలేదు. దీంతో సాయంత్రం వరకు వేచి చూసిన హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త తరుణ్ కు సమాచారం ఇచ్చారు. అతని సహకారంతో స్వయంగా 2 వీలర్‌పై మృతదేహన్ని తరలించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ బైక్ డ్రైవ్ చేస్తుండగా, వెనకాల మృతదేహాన్ని తరుణ్ పట్టుకుని కూర్చున్నాడు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఆ మృతదేహాన్ని జోగవానిపాలెం స్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం