బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

  విశాఖపట్నం, 2024, మే 9, టుడే న్యూస్ : గురువారం భీమిలి నియోజకవర్గము లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సమన్వయకర్త కిరణ్ కుమార్ శర్మ  అధ్యక్షతన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమములో ముఖ్య అతిథులు గా పాల్గొన్న కూటమి పార్లమెంట్ అభ్యర్ధి  భరత్,  భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ  మాట్లాడుతూ దేశములో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ జాతి అభివృద్ధికి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత  నారా చంద్రబాబునాయుడు కి దక్కుతుంది అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో లో కూడా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల హక్కులను కాపాడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కార్యక్రమములో బ్రాహ్మణ ప్రముఖులు సుసర్ల హరి, పరిమి నాగేంద్ర, పురుషోత్తమరాజు, రామశాస్త్రి, బాబీ, ప్రైవేటు అర్చక పురోహిత సంఘ సభ్యులు  కాళిదాసు, సుదీర్, బాలు శర్మ,  కృష్ణశర్మ, కామేశ్వర శర్మ, శివగణేష్, విస్సు, మొదలైనవారు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*