కేసీఆర్‌కు కరోనా పాజిటివ్... భావోద్వేగానికి గురైన కేటీఆర్, కవిత

 

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడటంపై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్త ం చేస్తున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత భావోద్వేగానికి గురవుతూ ట్వీట్లు చేశారు.

ప్రధానాంశాలు:
  • తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా
  • భావోద్వేగానికి గురైన కేటీఆర్, కవిత
  • తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌ రావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఈ వార్త తెలియగానే రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు షాకయ్యారు. కేసీఆర్ తనయుడు, మంత్రి  కేటీఆర్ , ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్‌కు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని కవిత తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలున్నాయని కేటీఆర్ తెలిపారు. అందరి ప్రార్ధనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై‌ కూడా ట్వీట్ చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లోకి రావాలంటూ పలువురు ట్వీట్లు, సందేశాలు పంపారు.సినీప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నాగశౌర్య, సుధీర్‌బాబు, గోపిచంద్‌ మలినేని, ఎస్‌ ఎస్‌ థమన్‌, శ్రీను వైట్ల, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, ఎమ్మెల్యేలు సీతక్క, రాజాసింగ్‌, డాక్టర్‌ సంగీతారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ నేతలు పి.మురళీధర్‌ రావు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌, కె.లక్ష్మణ్‌ తదితరులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు