ఏపీలో రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు


టుడేన్యూస్: రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారని... రాబోయే రోజుల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి క్లాసులను రద్దు చేస్తున్నామని.. వారందరికీ మంగళవారం నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వాటి షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని... ప్రస్తుతానికి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా నిబంధనలను అనుసరిస్తూ... నిర్వహించాలని సూచించారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు: ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం