కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య ..విశాఖ,టుడేన్యూస్: కొబ్బరితోట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్( 45) అనే వ్యక్తి   కంచరపాలెం పైడిమాంబ గుడి దగ్గర మృతిచెందాడు  .అయితే మృతిచెందడానికి కారణాలుగా ఎవరో  గుర్తుతెలియని వ్యక్తి తలపై  కొట్టడంతో చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు  .శ్రీనివాస్ కు గతంలో కూడా రెండవ పట్టణ భద్రత పోలీస్ స్టేషన్లో కూడా రౌడీషీట్ ఉందని  ,పలు దొంగతనాలకు చేస్తూ స్క్రాప్ వ్యాపారం  చేస్తూ  జీవనం సాగిస్తుండేవాడు అని  పోలీసులు అంటున్నారు  .ఈ హత్య సుమారుగా  గురువారం వేకువజామున  జరిగి ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు  . సమాచారం అందుకున్న క్లూస్ టీమ్ మరియు కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సిఐ కృష్ణారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు  తరలించి కేసు నమోదు చేశారు  .


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు: ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం