కష్టకాలంలో భారత్‌కు అండగా రష్యా.. కీలక ప్రకటన!

 

కరోనా కష్టకాలంలో రష్యా కీలక ప్రకటన చేసింది. భారత్‌కు బాసటగా నిలిచేందుకు రెడీ అవుతోంది. కరోనా ఇంజెక్షన్లను, ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ప్రధానాంశాలు:

  • భారత్‌కు రష్యా సాయం
  • కష్టకాలంలో అండ
  • కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మిత్ర దేశం. నమ్మకమైన భాగస్వామి. ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఇప్పుడు మరోసారి ఈ మాటలు నిజమయ్యాయి. కష్టకాలంలో ఉన్న భారత్‌కు రష్యా అండగా నిలిచింది. భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.  భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరకు కూడా చాలా ఉంది. ఆక్సిజన్ కొరత కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. ఇంకా వ్యాక్సిన్లు కూడా సరిపడే స్థాయిలో లేవు. ఇలా భారత్ చాలా పెద్ద కష్టంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా.. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మెడికల్ ఆక్సిజన్, రెమిడిసివిర్ వ్యా్క్సిన్లను సరఫరా చేస్తామని ప్రకటించింది. వచ్చే 15 రోజుల్లో వీటి దిగుమతులు ప్రారంభం కానున్నాయి. కష్టకాలంలో భారత్‌కు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.
వారానికి 3 లక్షల నుంచి 4 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయగలని మాస్కో ప్రకటించింది. వీటి సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపింది. నౌకల ద్వారా ఆక్సిజన్ సిలిండర్ల దిగుమతికి సంబంధించి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు