ఏపీ కర్ఫ్యూ: ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్‌





మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ఏకే సింఘాల్


విజయవాడ:  కరోనా   కట్టడి కోసం ఆంధ్ర్రదేశ్‌లో మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6-12 గంటల వరకు మాత్రమే దుకాణాల​కు అనుమతి.. మధ్యాహ్నం 12 తర్వత కరుఫ్యూ  అమల్లోకి వస్తుందని ఏకే సింఘాల్‌ తెలిపారు. ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర సేవలకు  ఎప్పటిలానే అనుమతి ఉంటుందన్నారు.   ఇక కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుమన్నారు ఏకే సింఘాల్‌. ప్రస్తుతం ఏపీలో 599 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది.. 82 కోవిడ్ కేర్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అని తెలిపారు. రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 447 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని.. 13,655 మంది కోవిడ్ కేర్ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్నారని ఏకే సింఘాల్‌ తెలిపారు.  ఆక్సిజన్ సరఫరా కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతున్నామని.. కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లను పెంచుతున్నామన్నారు ఏకే సింఘాల్‌. కోవిడ్ నియంత్రణకు అధికారులతో ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారన్నారు. స్టేట్‌ లెవల్‌ ప్రొక్యూర్‌ కమిటీ తొలి సమావేశం నిర్వహించాం.. ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని ఏకే సింఘాల్‌ తెలిపారు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం