ఈటలకు వెన్నుపోటు పొడిచారు.. టీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఈటలను అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికించారన్నారు. బాహుబలి సినిమాలోలా ఆయనకు వెన్ను పోటు పొడిచారన్నారు. నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నగేష్ ముదిరాజ్ ప్రకటించారు.
ప్రధానాంశాలు:
- బాహుబలి సినిమా తరహాలో వెన్నుపోటు
- ఈటలను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు
- టీఆర్ఎస్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈటల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈటలకు పలువురు నేతలు మద్దతు ఇస్తున్నారు. ఈటల వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిపై ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. ఉద్యమ కారుడైన ఈటల రాజేందర్‌ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటలకు బాహుబాలి సినిమాలోలా వెన్నుపోటు పొడిచారని నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు.
భూ కబ్జా ఆరోపణలు వస్తే అంత ఆదరా బాదరాగా విచారణ చేపట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎం తన సామాజిక వర్గాన్ని అభ్యున్నతి చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈటల రాజేందర్‌ను కావాలనే అణగదొక్కుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే కేసీఆర్ నిర్ణయంపై తీర్పు చెప్తారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై చేపడుతున్న కక్ష్య పూరితమైన చర్యలకు నిరసనగా తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రోవైపు భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హాచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈటల భార్య ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూ కబ్జా వ్యవహారంలో మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా జమునా హాచరీస్‌లోకి ప్రవేశించి విచారణ చేశారన్నారు. తమ అనుమతి లేకుండా హాచరీస్‌లోకి ప్రవేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.