ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు…జగన్ నిర్ణయం

May 31, 2021

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10 వరకు పగటి పూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు లను ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రతిరోజు 15 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అలాగే వంద మంది వరకు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే