ముడసర్లోవ పార్కు అభివృద్ధి కొరకు ఇప్పటికే కౌన్సిల్ డి.పి.ఆర్. ఆమెదం పొందింది --- జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి


విశాఖపట్నం, మే-28 :- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఇటీవల ముడసర్లోవ పార్కు అభివృద్ధి కి సంబంధించి రాజ్యసభ సభ్యులు      విజయసాయి రెడ్డి, జివిఎంసి కమిషనర్, విఎంఆర్ డి ఎ కమిషనర్, జాయింట్ కలక్టరు మరియు ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. ఈ పర్యటనకు సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయానని తెలిపారు. జనసేన పార్టి కార్పొరేటర్     పి.ఎల్.వి. నారాయణమూర్తి సాంఘిక మాధ్యమాలలోను, కొన్ని మీడియా గ్రూపులలోను కార్పొరేటర్లు మరియు అఫీసర్సు వాట్స్ యాప్ గ్రూపులలోను ముడసర్లోవ పార్కు అభివృద్ధి కొరకు జరిగిన పర్యటనపై అసత్య ఆరోపణలు చేసారని వాటిని ఖండిస్తున్నానని మేయర్ తెలిపారు. ముడసర్లోవలోని పర్యటనకు ముందస్తు సమాచారం ఉందని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వలన మీటింగుకు హాజరు కాలేకపోయానని, ముడసర్లోవ పార్కుకు సంబంధించిన డి.పి.ఆర్.ను కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించిందని తెలిపారు. ఈ ఆమోదానికి లోబడి మాత్రమె పార్కును సందర్సించడమైనదని, కాబట్టి ఇందులో ఎటువంటి కుట్రలు మరియు కబ్జాలు లేవని, చేయవలసిన అవసరం కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వారికి లేదని ఇందుమూలంగా తెలియజేయడమైనదని, ఈ విషయంపై ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత అధికారులతో చర్చించి స్పష్టత తీసుకోనవచ్చునని మేయర్ తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు