ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం
ప్రముఖ యాంకర్, సినీ నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండు రంగ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండు రంగ రాజు నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు కరోనా సోకిందా? లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అన్న విషయంపై స్పష్టత రాలేదు.
*ప్రదీప్‌కు కరోనా వచ్చిందని, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయన తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. యాంకర్‌గానే కాకుండా సినీ నటుడిగానూ ప్రదీప్ రాణిస్తున్నాడు. ఆయన హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.