* షీలా నగర్ కోవిడ్ కేర్ వైద్య కేంద్రం ఏర్పాట్లపై సమీక్షించిన రాజ్యసభ సభ్యులు : విజయసాయిరెడ్డి *
షిలానగర్, టుడే న్యూస్: కరోనా రోగుల చికిత్సకోసం, వికాస్ కళాశాలలో కోవిడ్ కేర్ వైద్య కేంద్రం ఎర్పాటుపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ,ప్రగతి భారత్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ వైద్య కేంద్రం కోసం శనివారం రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా వైద్యశాఖ అధికారులు,జీవిఎంసి అధికారులు,ఆంధ్రా మెడికల్ కాలేజ్ సిబ్బంది, పోలీసు శాఖ, ప్రగతి భారత్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ కేంద్రంలో ఇప్పటికే ఆక్సిజన్ ట్యాంకులు, సిలిండర్లును ఈ కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రంలో ఎర్పాటు చేసిన ఆక్సిజన్ 300 మందికి, మూడు రోజులు పాటు అందే విధంగా ఎర్పాట్లు చేశారు..యుద్ద ప్రాతిపదికన ఈ కేంద్రం ఏర్పాట్ల జరుగుతున్నాయి.అవసరం అయితే రోగులను కె.జి.హెచ్,విమ్స్ లకు తరలించేందుకు గాను రెండు అంబులెన్సులను సిద్ధం చేశారు. కరోనా బారినపడి 92 శాతం కన్న ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే వారిని కే.జి.హెచ్,విమ్స్ కు సిఫార్సు చెయ్యనున్నట్టు అధికారులు విజయసాయిరెడ్డికి వివరించారు. ప్రతి రోజు మూడు సిప్ట్ లలో రోగులను డాక్టర్లు పర్యవేక్షించ నున్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ట్రస్టి సభ్యులు గోపినాథ్ రెడ్డి,ఉమేష్,జాస్తి బాలాజీ,ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్, డిఎం అండ్ హెచ్ ఓ పి.సూర్య నారయణ,జీవిఎంసి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్,విద్యుత్, పోలీసు శాఖ అధికారులు,నోడల్ అధికారులు,స్థానిక కార్పొరేటర్లు,కాకి గోవింద రెడ్డి,తిప్పాల దేవన్ రెడ్డి,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాట్లపై ట్రస్ట్ సభ్యులు గోపీనాథ్ రెడ్డి మీడియాకు వివరించారు.