కోవిడ్ భయం లేకుండా బతకడానికి ఇదే సరైన దేశమా : సింగపూర్

 సింగపూర్: కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న దేశాల జాబితాలో గత వారం సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచిందని బ్లూమ్‌బర్గ్ కోవిడ్ రిసైలియెన్స్ ర్యాంకింగ్ పేర్కొంది.

కొన్ని నెలల పాటు ఈ స్థానంలో న్యూజీలాండ్ ఉండేది. ఈ జాబితా ఆయా దేశాల్లో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య, ప్రజలు స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

సింగపూర్‌లో వ్యాక్సినేషన్ సమర్థంగా నిర్వహించడం వల్లే ఆ స్థానం దక్కిందని బ్లూమ్‌బర్గ్ పత్రిక పేర్కొంది.

అయితే, న్యూజీలాండ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరగడం వల్లే న్యూజీలాండ్ స్థానం మారిందని అభిప్రాయపడింది.

అయితే, ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంలో నివసించడం ఎలా ఉంటుంది?

సింగపూర్‌లో తిరిగి నెలకొన్న సాధారణ జీవితం

ఫొటో సోర్స్,

ఫొటో క్యాప్షన్,

సింగపూర్‌లో తిరిగి నెలకొన్న సాధారణ జీవితం

సాధారణ జీవితం

సింగపూర్‌లో జీవితం చాలా బాగుంటుంది. కానీ, అక్కడ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి.

సింగపూర్‌లో అక్కడక్కడా వచ్చిన కేసులు తప్ప కోవిడ్ సామాజికంగా వ్యాప్తి చెందే రీతిలో అయితే ఇటీవల కాలంలో కేసులు రాలేదు.

ఈ వారంలో కొన్ని కొత్త కేసులు నమోదైనప్పటికీ వెంటనే తగిన నిబంధనలను అమలు చేశారు

ప్రయాణ నిబంధనలు, సరిహద్దు భద్రత వెంటనే అమలు చేయడంతో బయట నుంచి వచ్చే కేసులు ఆగిపోయాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సత్వరమే ఐసోలేషన్ లో పెట్టారు.

గత సంవత్సరం మొదట్లో విధించిన రెండు నెలల లాక్ డౌన్ తర్వాత మళ్ళీ దేశంలో లాక్ డౌన్ విధించలేదు.

జీవితం సాధారణంగా మారిపోయింది. నేను మా కుటుంబాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నాను. నా స్నేహితులతో కలిసి బయటకు డిన్నర్‌కు వెళ్తున్నాను. కానీ, మేం 8 మంది కంటే ఎక్కువ వెళ్లడానికి వీలు లేదు.

ప్రయాణికులు

ఫొటో సోర్స్,

మాస్కులు వాడటం తప్పని సరి. కానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు, తింటున్నప్పుడు మాత్రం మాస్కు తీయవచ్చు.

మేం ఆఫీసులకు కూడా వెళ్లి పనులు చేసుకుంటున్నాం. కాకపోతే భౌతిక దూరం పాటిస్తూ పని చేసుకుంటున్నాం.

సినిమాలకు, సభలకు, షాపింగ్ కి కూడా మాస్కు వేసుకుని వెళ్లొచ్చు.

స్కూల్స్, డే కేర్ కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి.

వారాంతంలో నేను పిల్లలను తీసుకుని బయటకు వెళ్తున్నారు.

కానీ, చాలా వేదికలు భౌతిక దూరం పాటించడం కోసం అనుమతించే వారి సంఖ్యను తగ్గించేశాయి. దాంతో వారాంతం బయటకు వెళ్లాలంటే సైనిక కవాతులా ఉంటోంది. (నేనొక అదృష్టం లేని సైనికురాలిని, నా పిల్లలు అధికారులు).

సింగపూర్‌లో15 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశంలో కేవలం 60 లక్షల మంది మాత్రమే ఉన్నాం. కానీ, ప్రభుత్వం పై ఉన్న నమ్మకం, సమర్థంగా నిర్వహించిన వ్యాక్సీన్ రోల్ అవుట్ వల్ల ఇది సాధ్యమైంది.

మేం సురక్షితంగా ఉన్నాం. కచ్చితంగా మాస్కు ధరించడం, కఠినమైన కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాలు, రవాణా పై, భారీ సమావేశాల పై విధించిన నిబంధనలు ఇందుకు సహకరించాయి. సరిహద్దులను కూడా సులభంగా మూయడం సాధ్యం కావడం, అధిక ధన నిల్వలు, వీటన్నిటి కంటే, సమర్థ విధానాలు కూడా ఈ పరిస్థితికి సహకరించాయి అని చెప్పవచ్చు.

కానీ, ప్రస్తుతానికి జీవించడానికి ఇదే ఉత్తమమైన దేశం అని చెప్పే వాదనకు కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి.

సింగపూర్‌లో చాలా మంది స్వేచ్ఛగా తిరగగలరు. కానీ, వలస కార్మికులకు తగినంత స్వేచ్ఛ లేదు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి తలెత్తిన సమయంలో వారిలో చాలా మంది ఇరుకైన పని స్థలాలలోనూ, డార్మిటరీలలోనూ ఉండిపోవలసి వచ్చింది.

ఆ డార్మిటరీలు వదిలి బయటకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఆమోదం పొందిన వినోదాత్మక కేంద్రాల్లో గడపాలన్నా కూడా వారి యజమానులు అనుమతి తీసుకోవల్సిన అవసరం ఉండేది.

డార్మిటరీల్లో వలస కూలీలు

ఫొటో సోర్స్,

మిగిలిన దేశ ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించడానికి ఇలాంటి చర్యలన్నీ అవసరం అని ప్రభుత్వం వాదించింది.

ఇది కొంత వరకు నిజమే అయినప్పటికీ చాలా మంది కార్మికుల వసతిని మెరుగుపరిచే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా చాలా మంది ఇరుకైన ఇళ్లల్లోనే నివసిస్తున్నారు.

సింగపూర్‌లో లోతుగా ఉన్న విభజనలకు ఈ పరిస్థితి అద్దం పడుతుంది.

"ఇది చాలా సిగ్గుపడే వివక్షతో కూడిన విషయం" అని వలస కార్మికుల ఉద్యమకారుడు జోలోవాన్ వామ్ అన్నారు.

"వలస కార్మికులకు రాజకీయ శక్తి ఉండకపోవడం వల్ల వారు విధానపరమైన వైఫల్యాల లోటుపాట్లను చవిచూస్తారు"

"న్యూజీలాండ్ ప్రజల హక్కులను అయితే కాలరాయలేదు".

ఫలితం ఒక్కటే ముఖ్యం కాదు. అది ఎలా సాధించామన్నది కూడా ముఖ్యమే" అని ఆయన అన్నారు.

ఈ మహమ్మారి దిగువ వర్గాల మీద, అల్పాదాయ వర్గాల వారి జీవితాల మీద తీవ్రమైన గాయాలను మిగిల్చింది.

ఆర్ధిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు, అవసరమైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్ని మిలియన్ డాలర్ల సొమ్మును విడుదల చేసింది. కానీ, నిరుద్యోగ రేటు మాత్రం ఎక్కువగానే ఉంది.

కేవలం ఈ సంఖ్యలు మాత్రమే పూర్తి కథను చెప్పవు.

కొంత మందికి వేతనాలలో కోతలు జరిగాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు కుదేలయిన ఆర్ధిక వ్యవస్థలో డ్రైవర్లుగా, డెలివరీ ఉద్యోగులుగా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవల్సి వచ్చింది.

"ఇది చాలా అనిశ్చితమైన పరిస్థితి. ఆ రోజుకు ఎంత సంపాదిస్తామో తెలియకపోవడమనే భావన చాలా ఒత్తిడికి గురి చేస్తుంది.

సాంఘిక భద్రత లేకపోవడమే సమస్య" అని సామాజిక కార్యకర్త పాట్రీషియా వీ అన్నారు.

"ఈ ఒత్తిడి కుటుంబ హింసకు కూడా దారి తీస్తుంది" అని ఆమె అన్నారు.

సింగపూర్‌లో తిరిగి నెలకొన్న సాధారణ జీవితం

ఫొటో సోర్స్,

ఫొటో క్యాప్షన్,

సింగపూర్‌లో తిరిగి నెలకొన్న సాధారణ జీవితం

బంగారు పంజరం

స్వేచ్ఛ, స్థిరమైన ఆదాయం ఉన్న మా లాంటి వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.

మహమ్మారికి ముందు మాకున్న ప్రైవసీ ఇప్పుడు పోయింది. మా కదలికలను ఎప్పుడూ ప్రభుత్వ యంత్రాంగం కనిపెడుతూనే ఉంటుంది. మేమెక్కడికి వెళ్లినా మేమొక యాప్ ని వాడటం కానీ, లేదా మేమున్న ప్రదేశాన్ని, మేము కలిసిన మనుషులను ట్రేస్ చేయగలిగే టోకెన్లను కానీ తీసుకుని వెళ్ళాలి. కానీ, ఈ సమాచారం రహస్యంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

కోవిడ్ 19 మహమ్మారి తర్వాత ప్రభుత్వ చర్యల పై పెద్దగా చర్చ లేకుండానే పర్యవేక్షణ పెరిగిపోయింది.

ఇలాంటి చర్యలు సంక్షోభ సమయంలో అవసరమని చాలా మంది వాదిస్తారు.

కానీ, అలాంటి డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

సోషల్ డిస్టన్స్

ఫొటో సోర్స్,

ఈ డేటాను కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యలకు మాత్రమే కాకుండా ఇతర అవసరాల కోసం వాడుకునేందుకు పోలీసులకు ఇచ్చినట్లు ప్రభుత్వం కూడా అంగీకరించింది.

అయితే, ఈ బంగారు పంజరం ఊసలు ఇంకా పూర్తిగా వీడలేదు. . ప్రయాణ నిబంధనలను చాలా వరకు సడలించకపోవడంతో ఇంకా విదేశాల్లో ఉన్న తమ బంధువులను కుటుంబాలను కలిసే వీలయితే లేదు.

సింగపూర్‌లో సాధారణంగా వారాంతంలో కూడా చాలా మంది దగ్గర్లో ఉన్న ఇండోనేసియా లాంటి దేశాలకు గాని, మలేసియాకు గాని విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తూ ఉంటారు.

అయితే, ఇలాంటి పర్యటనలన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. దీంతో చాలా హోటళ్లు "స్టేకేషన్స్" కోసం బుక్ అయిపోయాయి.

సింగపూర్, హాంగ్ కాంగ్ కు పర్యటనలు చేసేవారు పెరుగుతారు అనుకునేసరికి గత వారంలో కేసులు మొదలయ్యేసరికి మళ్ళీ ఆశలు చల్లారిపోయాయి.

షాపింగ్

ఫొటో సోర్స్,

మాకూ బాధ్యత ఉంది

అయితే, ఒక వైపు ప్రపంచంలో వైరస్ విధ్వంసం చేస్తుంటే బోర్ కొడుతోందని ఫిర్యాదు చేయడం కష్టం.

భారతదేశంలో కుటుంబాలు ఉన్న మా లాంటి కొందరికి అక్కడ చిక్కుకున్న మా కుటుంబ సభ్యులను చూస్తుంటే ఒక విధమైన న్యూనతా భావం కమ్మేస్తోంది.

"ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో పరిస్థితులు నరకాన్ని తలపిస్తుంటే మేమిక్కడ పర్యటకం పెరుగుతుందని ఆలోచిస్తున్నాం. మేమిక్కడే ఉండి మా జీవితాలను ఆనందంగా గడుపుతూ కష్టాల్లో ఉన్న దేశాలను చూస్తుంటే చాలా అనైతికంగా అనిపిస్తోంది.

"సింగపూర్ ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశం, ఇతర దేశాల పట్ల మేము ఎక్కువ నైతిక బాధ్యత చూపించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను".

ఈ చిన్న సురక్షిత దేశంలో ప్రస్తుతానికి మేము సురక్షితంగా ఉన్నందుకు కృతజ్ఞులమై ఉన్నాం అని ఇక్కడ చాలా మంది అంటారు.

కానీ, మహమ్మారి ఎప్పుడైనా తిరిగి తలెత్తవచ్చు.

ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి దేశాన్ని తెరవాలని సింగపూర్ ప్రభుత్వం చెబుతుంది.

ఇప్పటికే చైనా, ఆస్ట్రేలియా నుంచి వచ్చే కొంత మంది ప్రయాణీకులకు దేశంలోకి రావడానికి అనుమతులివ్వడం మొదలుపెట్టింది.

సింగపూర్ ఒక రోజు మిగిలిన ప్రపంచమంతటితో కలుస్తుంది. కోవిడ్ ని ఎదుర్కొన్నాం అనడానికి అదే మాకు నిజమైన పరీక్ష అవుతుంది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం