తెలంగాణలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, రేమ్‌డెసివిర్ కొరత లేదు: హరీష్‌రావు

 

హైదరాబాద్: తెలంగాణలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, రేమ్‌డెసివిర్ కొరత లేదని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండో డోసు వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. కోవిషీల్డ్ పరిమితి 6 నుంచి 12 వారాలకు పెంచడంతో.. అత్యవసరంగా టీకా వేయాల్సిన పరిస్థితి తప్పిందన్నారు. కొవగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సిన వారు రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారని, కేంద్రం నుంచి వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదని తెలిపారు. వ్యాక్సిన్ అందగానే 45 ఏళ్లు పైబడిన వారందరికీ రెండో డోస్‌ అందిస్తామని హరీష్‌రావు ప్రకటించారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు