దేశంలోనే తొలిసారి మహిళా బడ్జెట్ .. సీఎం సంచలన నిర్ణయం

 

అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను జగన్ సర్కార్ సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు జెండర్ బడ్డెజ్ ప్రవేశపెట్ట లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలతో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం ప్రవేశపెట్టారని చెప్పారు. రాజకీయంగా మహిళలకు సీఎం జగన్ మెరుగైన అవకాశాలు ఇచ్చారని మంత్రి వనిత చెప్పారు.
ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ పేరుతో ఎవరి కేటాయింపులు వారికి నేరుగా చేరేలా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు జరపనుంది జగన్ ప్రభుత్వం. దీని ఆధారంగానే ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. రేపు ఉదయం 9గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చ్యూవల్ పద్దతిలో ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం తర్వాత 2021-22 ఆర్ధిక బడ్జెట్‌ను రాజేందర్‌ ప్రవేశపెడతారు. ఇప్పటికే 3 నెలల కాలానికి 70వేల 983.11 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్‌ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించారు. మిగిలిన 9 నెలల కాలానికి పూర్తి స్థాయి ఆర్ధిక బడ్జెట్‌ ఇది. కరోనా కారణంగా ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్‌ టైం జండర్ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభకు సమర్పించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఈ జెండర్‌బడ్జెట్‌ ప్రస్తావన ఉంది. అయితే ఆస్ట్రియా, కెనాడ, బెల్జియం, చిలీ, ఫిన్‌లాండ్‌, జర్మనీ, ఐస్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌, మెక్సికో, నార్వే, పోర్చుగల్‌, స్పెయిన్‌, స్వీడన్‌ తదితర దేశాల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. పౌరులుగా స్త్రీలు తమ గొంతులను ప్రభుత్వ నిర్ణయాల్లో వినిపించడానికి ఇవి దోహదపడుతున్నాయి. ప్రభుత్వ ఖర్చులు, విధానాలను ప్రభావి తం చేసి, కేటాయింపులు- చేస్తున్న ఖర్చుల మధ్య ఉన్న డొల్లతనాన్ని వేలెత్తి చూపుతున్నాయి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు