మనం – మన సమాజం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి నిబందనలను పాటించాలి.

 


తిరుపతి, టుడే న్యూస్ : తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ సి.హెచ్.వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.   రెండవ దశ కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించి ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న తరుణంలో ఈ రోజు తిరుపతి నగరంలో పలు కూడలి యందు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  సి.హెచ్.వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్  పరిశీలించి కర్ఫ్యూ ఏ విధంగా జరుగుతున్నదని పరిశీలించారు.

జిల్లా యస్.పి ప్రభుత్వ నిబందనల సమయం ముగిసినా కూడా కొంతమంది అనవసరంగా రోడ్లపై తిరుగుతుండటం చూడటం జరిగింది. ప్రజలు కర్ఫ్యూ నిబందనలను పాటించాలి, పాసిటివ్ కేసులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్దేశించిన సమయం తరువాత బయట అనవసరంగా ఎవరు తిరగరాదు. కానీ కొన్ని చోట్ల నిభందనలను ఉల్లంఘిస్తున్నారు. అట్టి వారికి జరిమానా విధించి కర్ఫ్యూ నిబందనలను తెలియపచడం జరిగింది. ప్రజలందరూ తప్పనిసరిగా నిబందనలు పాటించి ఇంటివద్దనే ఉండాలి. 

 కర్ఫ్యూ నిబందన కాలం ముగిసేవరకు ఇంటిపట్టునే ఉండి సహకరించాలన్నారు. మీరు ఇంటిలో ఎంత శుభ్రంగా ఉన్నా ఇంటి కుటుంబ సభ్యులు వీదుల్లో తిరిగిరావడంవలన కరోనా వైరస్ ను సులబంగా మీ ఇంటికి తెచ్చినట్లే. దయచేసి ప్రజలు వారికి వారే స్వయ నిర్బంధాన్ని నియంత్రించుకోవాలి. “నాకు రాదు, నాకు ఏమీ కాదు, రా అన్నది రాకమానదు. పో అన్నది పోకమానదు” అన్న దొరని సరికాదు. కోరోనా వైరస్ వస్తే సులబంగా పోదు. పోతూ పోతూ మన ప్రాణాల్ని కూడా తీసుకొని వెళుతుంది. దయచేసి గమనించండి కరోనా తీవ్రత గురించి ప్రజలు తెలుసుకోవడం లేదు. మీకోసం – మీ పిల్లలు, మీ కుటుంబ కోసమైనా, నిబందనలను పాటించండి. ఉపద్రవం ఇంటికి వచ్చిన తరువాత ఎవరు కాపాడలేరు. సహకరించండి. మనం – మన సమాజం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి నిబందనలను పాటించి సహకారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా యస్.పి  తెలిపారు.ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు