-పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకి : విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ బాసట

-సీఈ ఎం ఆర్  ఎఫ్  నుంచి మంజూరైన రూ.4.79 లక్షల  చెక్కులు అందజేత  -హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు 

విశాఖపట్నం , మే 7,టుడే న్యూస్:   దీర్ఘకాలికంగా పలు ఆరోగ్య సమస్యలతో  బాధపడుతున్న తొమ్మిది మంది బాధితులకి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు ..ఈ నేపథ్యంలో  4.79 లక్షల చెక్ చెక్కులను నేరుగా లాసన్స్ బే పార్టీ ఆఫీసులో అందజేశారు వివరాల్లోకి వెళితే...పలు అనారోగ్య కారణాలరీత్యా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకి  సి ఎం ఆర్ ఎఫ్  నుంచి మంజూరైన చెక్కులను విశాఖ ఎంపీ అందజేశారు.

విశాఖ పెద్ద కొత్తూరు  ప్రాంతానికి చెందిన పెంట  పల్లి యోజన్ కు రూ.45 వేలు, శృంగవరపుకోట కు చెందిన కాండ్రేగుల జయలక్ష్మి కి రూ.1.20 లక్షలు, పెద్ద జాలరి పేట కు చెందిన చింతపల్లి అప్పన్నకు రూ 17 వేలు, మల్లా సూరి వీధికి చెందిన  రిక్కి వెంకటరమణ మూర్తి కి రూ.60 వేలు, ఉండ్రాజవరం నికి చెందిన పెన్నేటి వెంకట గీష్మంత్ కు రూ. 16 వేలు, ఎంవిపి కాలనీ కి చెందిన ఎస్ నాగేశ్వరరావు కు రూ.90 వేలు, దుర్గ భవాని పాలానికి చెందిన డి రమణ కు కు రూ.50 వేలు , ఉండ్రాజవరం నికి చెందిన వెంకట శ్రీనివాసరావు కు రూ.60 వేలు, అలాగే ఎస్సీ కాలనీకి చెందిన కె మరియమ్మ కు రూ.21 వేలు చొప్పున మంజూరైన మొత్తం 4.79 లక్షల చెక్ లను ను విశాఖ ఎంపీ కార్యాలయం లో ఎంపీ శుక్రవారం అందజేశారు.  అంతకు మునుపే సంబంధిత బాధితులు విశాఖ ఎంపీ ని సహాయార్ధం ఆశ్రయించారు. స్పందించిన ఎంవీవీ   ముఖ్యమంత్రి  సహాయ నిధి కింద  వైద్య ఖర్చుల కింద సదరు  బాధిత వ్యక్తుల  ఆర్ధిక సహాయనికై  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు  . .  తదుపరి వారివారి ఆసుపత్రి ఖర్చులకు రూ.4.79  లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం  నుంచి  ఆమోదం లభించింది. ఆ మంజూరైన చెక్  లను వారి కుటుంబ సభ్యులకు లా సన్స్  బే కాలనీ లో అందజేశారు. ఈ సందర్భంగా చెక్  గ్రహీతలు  మాట్లాడుతూ ఆర్ధికంగా పరిపుష్టి లేని   తమకు దన్నుగా నిలిచి , ఈ సహాయం  తమకు అందజేసేందుకు కృషిచేసిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు. ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలో    ఉన్న ప్రతి ఒక్కరికీ  ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు