రెండేళ్ల పాలనపై జూమ్ మీటింగ్ నిర్వహించిన : సమన్వయకర్త కె కె రాజు విశాఖపట్నం,టుడే న్యూస్:    వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్పొరేటర్లు,  మేధావులు,  లబ్ధిదారులతో జూమ్ మీటింగ్ ను ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కె కె రాజు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు , లబ్ధిదారుల వివరాలు, ఖర్చు చేసిన అమౌంట్ వివరాలు తెలియజేశారు.  అలాగే లబ్ధిదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క అనుభవాలను మరియు ఈ సంక్షేమ పథకాల ద్వారా  వారికి చేకూరిన లబ్ధి వివరాలు తెలియజేశారు. మేధావులు కూడా ఈ పథకాల ద్వారా ఉపయోగాలను, చేపట్టవలసిన విధానాల గురించి కూడా సూచనలను సలహాలను అందజేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*