ఆ వార్తలు నిజం కావు.. కన్ఫామ్ అయితే నేనే మీకు చెబుతా… పవన్ మూవీ రూమర్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెంటవెంటనే ఆ చిత్రాలను సెట్స్ పైకి తీసుకోచ్చేశాడు కూడా.


ఆ వార్తలు నిజం కావు.. కన్ఫామ్ అయితే నేనే మీకు చెబుతా... పవన్ మూవీ రూమర్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెంటవెంటనే ఆ చిత్రాలను సెట్స్ పైకి తీసుకోచ్చేశాడు కూడా. ఇటీవలే పవన్ వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక అదే జోష్ తో పవన్ వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ఇక కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ కు బ్రేక్ పడింది. ఇక ఇదే క్రమంలో పవన్ తదుపరి సినిమాలపై అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మరో మూవీ చేసేందుకు సిధ్దంగా ఉన్నాడు. దీంతో వీరిద్ధరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ పై బండ్ల గణేష్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరి సినిమా గురించి మరో రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న సినిమాను డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై బండ్ల గణేష్ మరోసారి స్పంధించారు… అవన్నీ తప్పుడు వార్తలని.. అన్ని కన్ఫామ్ అయ్యాక తానే చెబుతాను అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజ ప్రధాన పాత్రలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు