*తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?: నారా లోకేశ్*


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

 మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఆ హామీని నెర‌వేర్చ‌ట్లేద‌ని, అంతేగాక, సొంత బ్రాండ్‌ను అమ్మిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

'ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధం చేస్తామంటిరి క‌దా వైఎస్ జ‌గ‌న్ గారు.. దశ‌ల‌వారీగా మ‌ద్యం అమ్మ‌కం వేళ‌లు మారుస్తూ..

 తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే స‌మ‌యానికి ముందే మ‌ద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?' అని లోకేశ్ విమ‌ర్శించారు.

'క‌రోనా మందుల్లేక ప్రాణాలు పోతున్నాయంటే, నా సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడ‌ల్‌ తాగమంటున్న‌ట్టుంది మీ ఎవ్వారం.

 బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం' అని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం