2021: ‘మా’ ఎన్నికల పోటీల్లో ట్విస్ట్.. రంగంలోకి హిందూ సంఘాలు… ప్రకాష్ రాజ్ పెత్తనం ఒప్పుకోం అంటూ…
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నలుగురు పోటీదారులతో రాజకీయ
నటుడిగా ప్రకాష్ రాజ్ ను గౌరవిస్తాం..అభిమానిస్తాం.. పెత్తనం చేస్తానంటే ఒప్పుకోం అని హిందూ సంఘాలు వాదిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిలుస్తున్నాయి. హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రకాష్ రాజ్ గతంలో హిందువులను కాకులతో పోల్చాడు. అతను గెలిస్తే హిందూ కళాకారులకు అన్యాయం జరగవచ్చు. ఆయనకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరు కాకులుగా ఒప్పుకున్నట్లే.. ‘మా’ లో కాకులు లేవనే భావిస్తున్నామని హిందూ సంఘాల నాయకుడు దుర్గా శ్రీరామ్ అన్నారు.
ప్రకాష్ రాజ్ కు తన సొంతం రాష్ట్రంలోనే ప్రజలు తిరస్కరించారు. ఆయన మద్ధతుదారులు పునరాలోచించాలని.. ఇది హిందువుల, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఇక అటు మా ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్యానెల్ సభ్యులు బహిరంగంగా వాదనలు వినిపిస్తున్నారు.