తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉదయం ఎమ్మెల్యే సాయంత్రం మంత్రి చెక్కులు అందజేత
విశాఖపట్నం, జనవరి 8 , టుడే న్యూస్: కోవిడ్ మూలంగా తల్లి దండ్రులను కోల్పోయిన అనకాపల్లికి చెందిన ఇద్దరు పిల్లలకు అ నియోజకవర్గ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
చెరో రూ.10 లక్షల చెక్కులను మంగళవారం ఉదయం రైల్వే న్యూ కాలనీ లో వారి ఇంటికి వెళ్లి వెళ్లి అందజేశారు
అయితే ఇది ఇలా ఉంటే ఉదయం ఎమ్మెల్యే అందజేయగా సాయంత్రం
పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆ పిల్లలను జిల్లా కలెక్టర్ కార్యాలయంకు పిలిపించుకొని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్. మేయర్ జి.వి.హరికుమారి, అరకు ఎం.పి. జి.మాధవి, అనకాపల్లి ఎం.ఎల్.ఏ. గుడివాడ అమర్ నాథ్.సమక్షంలో అందజేశారు.
ఇలా పిల్లలకు ఇవ్వాల్సిన చెక్కులను ఉదయం ఎమ్మెల్యే సాయంత్రం మంత్రి అందజేయడంతో విశాఖ ప్రజలు వీరి ఫోటోల ఫోజు లకు నవ్వుకుంటున్నారు
తల్లిదండ్రులు మరణించి బాధలో ఉన్న పిల్లలకు ఇవ్వాల్సిన ఓకే ఇరవై లక్షల చెక్కులను ఇరువురు రెండుసార్లు ఇవ్వడంపై ఆదిపత్య పోరు కోసం వీరి పాకులాట లా కనిపించిందని ఆ పార్టీ నాయకులు లే నోళ్లు కోరుకోవడం గమనార్హం