ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా


అమరావతి, జూన్ 03 : ప్రజా రవాణా శాఖ లో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నా పలు సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంస్థ కమిషనర్ ద్వారకాతిరుమల రావు అన్నారు. గురువారం వై.ఎస్.ఆర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు శాలువాలో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు ఉద్యోగులు ఎదురుకొంటున్న పలు సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు పడుతున్న ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమస్యలు పరిష్కారం లో ఉద్యోగుల సంఘాలు సహకరించాలని అయిన కోరారు. కమిషనర్ కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.వి.రావు, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.కె.హాబీబ్, కృష్ణ రీజియన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.శేషయ్య, టి.జ్ఞాననందం, నాయకులు గౌస్, కె.వి.కె.రావు, రత్నం, శివ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*