ఏపీలో కరోనా అదుపులో ఉంది.. ఆక్సిజన్ కొరత లేదు.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దుః: సీఎం జగన్

 

కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

  • AP CM Jagan: ఏపీలో కరోనా అదుపులో ఉంది.. ఆక్సిజన్ కొరత లేదు.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దుః సీఎం జగన్
 కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం క్యాంపు కర్యాలయంలో అధికారులత సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు అయిన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందన్న సీఎం.. అధికారుల పనితీరును అభినందించారు. ఆస్పత్రిల్లో ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు చనిపోయినట్టు వచ్చిన వార్తలను సీఎం ఖండించారు. రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ చాలా విరివిగా అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని చోట్ల విస్తారంగా ఆక్సిజన్‌ లభ్యత ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ చాలా తగ్గుతోంది. పాజిటివిటీ రేటు సగటున 5 శాతం కంటే తక్కువగా ఉంది. రాష్ట్రంలో 70శాతానికిపైగా ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 70శాతానికిపైగా వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.   

కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు 750 టన్నుల మెడికల్‌ఆక్సిజన్‌ను వినియోగించామని, ప్రస్తుతం అది 180 టన్నులు అందుబాటులో ఉంటోందని అధికారులు సీఎంకు వివరించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఇచ్చినకేటాయింపులను అక్కడ నిల్వ చేస్తున్నామని, అవసరాలమేరకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు.

రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తికి, ప్రస్తుత అవసరాలకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇక కొరత ఎక్కడవస్తుందని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ఆశ్రమ్‌ ఆస్పత్రిలో మరణాలంటూ కథనాలపై చర్చించిన సీఎం.. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికలోని వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ముఖ్యమంత్రికి వివరించారు. విషమ పరిస్థితుల్లో ఉన్న పి.దొరబాబు అనే వ్యక్తిని మే 25న ఆశ్రమ్‌ ఆస్పత్రిలో చేర్చారని, ఆ వ్యక్తికి డయాబెటిస్‌ సహా ఇతర దీర్ఘకాలిక సమస్యలున్నాయని నివేదికలోని అంశాలను అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సీఎంకు తెలిపారు. దొరబాబు 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, జూన్‌ 26న పేషెంట్‌ పరిస్థితి మరింత విషమించిందని, ఆక్సిజన్‌ లెవల్‌ 80 శాతం ఉన్నప్పటికీ శ్వాససంబంధ సమస్య వచ్చింది. వెంటనే డాక్టర్లు సీపీఏపీ వెంటిలేటర్‌ మీదకు మార్చి ప్రాణాలు కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తోడుకావడంతో మరణించారని ముఖ్యమంత్రికి వివరించారు.

ఇదిలావుంటే, ఇటీవల వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం.. మరణించిన వారిలో మరో ఇద్దరు జె. నాగలక్ష్మి (42) కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారని, ఈమరణానికి శ్వాససంబంధమైన అంశం సమస్యకాదని స్పష్టంచేశారన్నారు. 55 ఏళ్ల బెంజిమన్‌ అనే వ్యక్తి కూడా కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా మరణించారని దీనికి శ్వాససంబంధమైన సమస్య కారణం కాదన్నారు. 26వ తేదీన ఆశ్రమం ఆస్పత్రిలో కరెంటు సరఫరా సమస్య లేదని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారన్నారు. దీనిపై చర్చించిన సీఎం తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు