ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు
Jul 24, 2021

అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 18 మంది మృతి చెందారు. తాజాగా 2,737 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,16,914 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 13,241మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,50,103 టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.