వద్దురా అంటే వినలేదు.. భార్య లవర్‌ చెవులు, ముక్కు కోసేసిన భర్త

 

Jul 24, 2021, 

Husband Cuts Her Wife Lover Ears And Nose In Pakistan - Sakshi

లాహోర్‌: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. ఆమె ప్రియుడికి కూడా చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. ప్రస్తుతం ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పక్కదేశం పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.    పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ముజఫరానగర్‌కు చెందిన అబ్దుల్‌ ఖయ్యూమ్‌ తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఇతడి భార్యకు మహ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యతో దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా వారిద్దరూ మాట వినలేదు. సంబంధం కొనసాగిస్తుండడంతో ఖయ్యూమ్‌ కత్తి తీసుకుని అక్రమ్‌ వెంట పడ్డాడు. కత్తితో అక్రమ్‌ ముక్కు, చెవులు, కోసేశాడు. తీవ్ర గాయాలపాలైన అక్రమ్‌ వెంటనే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించిన వైద్యులు ఏం జరిగిందని వివరాలు ఆరా తీయగా పై విషయం వెలుగులోకి వచ్చింది.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం