23ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఒక స్మగ్లర్ అరెస్ట్


తిరుపతి సమీపంలో ని కరకంబాడీ పరిధి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాధ్ కరకంబాడీ బీట్ పరిధి లో కూంబింగ్ చేపట్టారు. తిరుపతి రేంజ్ కృష్ణాపురం  సెక్షన్ ఎస్వీ బాయ్స్ హాస్టల్ వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. అక్కడకు చేరుకుని వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలు పడవేసి పారిపోయారు. అందులో ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు. అతనిని తమిళనాడు వేలూరు జిల్లా వసంతపురం గ్రామానికి చెందిన అన్నామలై లక్ష్మణన్ (51)గా గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అక్కడ పడి ఉన్న 23 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సుందర రావు మాట్లాడుతూ ఈ దుంగలు 668 కేజీలు ఉన్నాయని, విలువ 40లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. ఈ కేసు ను టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ మోహన్ నాయక్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సిఐ లు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, ఎఫ్ ఆర్వోలు ప్రసాద్, ప్రేమ, ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాధ్, లింగాధర్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్