*📢ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ తేదీ ఖరారు*


అమరావతి: ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఆన్‌లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు.  ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు.*

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం