నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్‌

 

న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇది కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే అద్భుత వనరు. ప్రస్తుతం యూట్యూబ్‌లో సొంతంగా చానెల్‌ కలిగి ఉండి.. దాని ద్వారా ఇంట్లో కూర్చునే ఆదాయం సంపాదిస్తున్నారు చాలా మంది. కొందరు యూట్యూబర్స్‌ నెలకు ఏకంగా ఎంఎన్‌సీ కంపెనీల కే సీఈ ఓ  ల కన్నా అధిక ఆదాయాన్ని పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందిన యూట్యూబరే భువన్‌ బామ్‌.  భువన్‌ బామ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా నెలకు ఏకంగా సుమారు 95 లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ విషయాలను కానాలెడ్జ్‌.కామ్‌  caknowledge.com  అనే సైట్‌ వెల్లడించింది. ఇదే కాక భువన్‌ బామ్‌ పేరుమీద మరో రికార్డు కూడా ఉంది. భారతదేశంలో 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ సాధించిన తొలి యూట్యూబర్‌గా రికార్డు సృష్టించాడు భువన్‌. అతడి సక్సెస్‌ స్టోరీ వివరాలు..  న్యూఢిల్లీకి చెందని భువన్‌ బామ్‌ గ్రీన్‌ ఫీల్డ్స్‌ స్కూల్‌లో చదువు పూర్తి చేసుకున్నాడు. షాహీద్‌ బాగ్‌ సింగ్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం బీబీ కి వైన్స్‌ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ స్టార్ట్‌ చేశాడు. చఖ్నా ఇష్యూ అనే వీడియో వైరల్‌ అవ్వడంతో భువన్‌ బామ్‌ చానెల్‌ సబ్‌స్క్రైబర్స్‌ పెరగడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఇతడి చానెల్‌కు ఏకంగా 22 మిలియన్ల మంది కన్న ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేశారు. అర్థవంతమైన కంటెంట్‌తో నెటిజనలును అలరిస్తుంటాడు భువన్‌ బామ్‌. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో కూడా నటించాడు భువన్‌ బామ్‌.  ఇక యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా భువన్‌ బామ్‌ ఏడాది ఏకంగా 22 కోట్లు సంపాదిస్తున్నాడని.. నెలకు సుమారు 95 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడని.. కానాలెడ్జ్‌.కామ్‌ వెల్లడించింది. ఇదే కాక మింత్ర డీల్‌ ద్వారా మరో 5 కోట్ల రూపాయలు, మివి ద్వారా 4 కోట్ల రూపాయలు  సంపాదిస్తున్నాడని తెలిపింది. ఇవే కాక భువన్‌ బామ్‌ ఆర్కిటిక్‌ ఫాక్స్‌, లెన్స్‌కార్ట్‌, మివి, బియర్డో, టిస్సాట్‌, టేస్టీట్రిట్స్‌ వంటి వాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*