*కామాంధుడైన రైల్వే సూపర్వైజర్ కు దేహశుద్ధి*

 తిరుపతి  మహిళా కార్మికులను లైంగికంగా వేధిస్తూ, తనకు సుఖం ఇస్తేనే డ్యూటీ ఇస్తానని, మహిళా కార్మికుల్ని వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ చెందిన రైల్వే సూపర్వైజర్  గుణశేఖర్ కు సిఐటియు, ఐద్వా కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు... తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ క్లీనింగ్ కార్మికులపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కోచ్ సూపర్వైజర్ గుణశేఖర్ నాయుడిని ట్రాప్ చేసి పోలీసులకు అప్పజెప్పారు. తన కోరికను తీర్చాలని తీర్చకపోతే డ్యూటీ ఇవ్వనని ఓ మహిళా కార్మికురాలిని వేధిస్తున్న నేపథ్యంలో సూపర్వైజర్ ను సిఐటియు, ఐద్వా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పోలీసులకు పట్టివ్వడమే కాకుండా దేహశుద్ధి చేశారు... తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో  దేహ శుద్ధి చేసి  పోలీసులకు అప్పజెప్పటం జరిగింది.

గత కొన్ని రోజులుగా రైల్వే కోచ్ లో పనిచేస్తున్న మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, తనకు లొంగ కుంటే గుణశేఖర్ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవారు. సూపర్వైజర్ తనకు  లొంగిన వాళ్లను ఒకరకంగా రాని వాళ్ళను మరో రకంగా చూస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఫలితంగా అనేక మంది మహిళలు అతని బారినపడి తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు... గత కొన్ని రోజుల నుంచి ఓ మహిళా కార్మికురాలిని లైంగికంగా కోరిక తీర్చాలని, రైల్వే బోగీలను క్లీన్ చేస్తున్న సమయంలో బలవంతం చేసేవాడు... ఇంటికెళ్లి కెళ్ళి ఆమె పిల్లల ముందు అసభ్యకరంగా  వ్యవహరించడం,  తాకరాని చోట తాకడం ఇలాంటివి నిత్యకృత్యంగా చేసే వాడు. బాధిత మహిళా కార్మికురాలు సిఐటియు, ఐద్వా సంఘాలను ఆశ్రయించిన నేపథ్యంలో సూపర్వైజర్ ని మహిళా సంఘాలు, పోలీసుల సహకారంతో ట్రాప్ లోకి లాగారు. ట్రాప్ లో పడ్డ రైల్వే సూపర్వైజర్ గుణశేఖర్ ఈరోజు తిరుచానూరులో ఒక ప్రైవేట్ లాడ్జి లో రూమ్  బుక్ చేసి బాధిత మహిళను రమ్మని  పిలిచాడు.... పోలీసులు సిఐటియు, మహిళా సంఘాల సహకారంతో వెళ్లిన బాధిత మహిళ రెడ్ హ్యాండెడ్ గా కామాంధుడు గుణశేఖర్ ను పట్టిచ్చింది. ఈ సందర్భంగా బాధిత మహిళ గుణ శేఖర్ ను చెప్పుతో కొట్టి  దేహశుద్ధి చేసింది. పోలీసులు, యువజన సంఘాల కార్యకర్తలు, మహిళలు కామాంధుడు గుణశేఖర్ కు బుద్ధి  చేప్పారు... అనంతరం  పోలీస్ లకు గుణశేఖర్ ను అప్పజెప్పారు... ఈ కార్యక్రమం లో  ఐద్వా జిల్లా కార్యదర్శి పి. సాయి లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర , సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి సుమన్, విశ్వనాథ్, భాస్కర్ ఐద్వా నగర నేత రాధా, ఐద్వా నగర అధ్యక్షురాలు సుజాతమ్మ, కార్యదర్శి జయంతి తదితరులు పాల్గొన్నారు... పి. సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు