మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామామా ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు' అంటూ ట్వీట్‌ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా మా ఎన్నికల్లో నాగబాబు మొదటి నుంచీ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయనను విజయతీరాలకు చేర్చేందుకు మెగా బ్రదర్‌ ఎంతగానో కష్టపడ్డారు. కానీ అంతిమంగా ఈ పోరులో మంచు విష్ణు విజయాన్ని ముద్దాడారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*