ప్రకాశ్‌ రాజ్‌ సంచలన నిర్ణయం, ‘మా’ సభ్యత్వానికి రాజీనామా


మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ ఘన విజయం సాధించగా, ఇక  ప్రకాశ్‌ రాజ్‌  ప్యానల్‌ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం(అక్టోబర్‌ 11) హైదరాబాద్‌లోన దస్బల్లా హోటల్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికలు చాలా చైతన్య వంతంగా జరిగాయి. గెలిచిన మా సభ్యులకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ మీకు, నాకు తెలుసు.  హామీలు అన్నింటినీ పూర్తి చేయడం ముఖ్యం. నా ప్రాంతం, జాతీయ వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. నేను తెలుగు బిడ్డనే, నేను ఒక కళాకారుణ్ణి’ అంటూ చెప్పిన అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం