ఈ విజయం మా నాన్నగారిది.. మంచు విష్ణు



తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన   మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష న్‌( మా) ఎన్నికలు   ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేశాడు. గెలుపు ప్రకటన అనంతరం విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్‌బాబుకు అంకితమిచ్చారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

వివాదాలకు పుల్ స్టాప్ పెట్టండి.
మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడు. చిరంజీవి, నాగార్జున, పవన్‌ కల్యాణ్‌ సహా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశీస్సులు విష్ణుకు ఉంటాయి. నా బిడ్డ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడు. మా అభివృద్ధికి విష్ణు కట్టుబడి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. వివాదాలకు ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఎవరూ ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు' అని సూచించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే