*జనవరి 5 నుండి జాతీయస్థాయి కబడ్డీ పోటీలు - ఎమ్మెల్యే భూమన*
తిరుపతి:
తిరుపతి వేదికగా జాతీయ స్థాయి ఆహ్వానిత పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు జనవరి 5 నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని వై.ఎస్.ఆర్ సమావేశ మందిరంలో మంగళవారం కబడ్డీ పోటీల పోస్టర్ ను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ గిరీషా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ హరిత, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ ల సమక్షంలో మెగా పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దాదాపు ప్రతి ఓక్కరు ఆడే ఆటగా విశిష్ట స్థానమున్న కబడ్డీని,తిరుపతి వాసులకు మరోసారి పరిచయం చేసేందుకు వేదిక కావడం అభినందనీయమన్నారు.తాను తుడా చైర్మెన్ గా వున్నప్పుడు రెండు మార్లు జాతీయస్థాయి కబడ్డీ పోటీలను తిరుపతిలో జనాలు ఆకట్టుకునేల నిర్వహించిన విషయాన్ని భూమన గుర్తు చేస్తూ,మరోసారి తిరుపతిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించాలని తాను కోరడంతో స్పందించి అమలు చేస్తున్న కమిషనర్ గిరీషా,మేయర్ శిరీషాలకు ప్రత్యేకంగ అభినందనలు తెలియజేసారు.ప్రజలు ఈ కబడ్డీ పోటీలకు విచ్చేసి ఆస్వాదించి, క్రీడాకారులను ప్రోత్సహించాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ఆకాంక్షించారు.
మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ కరోనా కట్టడిలో ఇబ్బందులు పడిన ప్రజలకు మంచి ఆటవిడుపుగా జనవరిలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు వుంటాయన్నారు.తిరుపతిలో జరిగే ఈ పోటీలు చిరస్థాయిలో నిలిచిపోయోల నిర్వహిస్తామని,తిరుపతి నగర ప్రజలందరూ ఈ పోటీలను తిలకించేందుకు రావాలని మేయర్ శిరీషా విజ్ఞప్తి చేసారు.పోటీలకు కావల్సిన సదుపాయాలు తమ కౌన్సిల్ అనుమతితో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.ఎస్.గిరీషా ఐఏఎస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సూచన మేరకు తిరుపతి నగరపాలక సంస్థ,తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్తంగ జనవరి 5 నుండి 9వ తేదీ వరకు జాతీయ స్థాయి స్త్రీ, పురుషుల ఆహ్వానిత కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. తిరుపతి ఇందిరా మైదానం వేదికగా జరుగు ఈ మెగా టోర్నీనిలో దేశం నలుమూల నుండి
పురుషుల విభాగంలో 18 జట్లు, మహిళల విభాగంలో 12 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో జరుగు ఈ పోటీలు సింతటిక్ మ్యాట్ పైన జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణ కోసం మూడు వైపులా ప్రజలు కూర్చుని చూసేందుకు ఇప్పటికే గ్యాలరీలు సిద్ధంగా ఉండగా, మరో వైపు కూడా గ్యాలరీ సిద్ధం చేస్తున్నామన్నారు.క్రీడాకారులకు కావలసిన వసతి సౌకర్యాలు, భోజన సదుపాయాలు,రవాణా తదితర కార్యక్రమాలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని,పురుషుల విభాగంలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు వరుసగా 150000,125000,100000,75000 అదేవిదంగ మహిళల విభాగంలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లకు వరుసగా 125000,100000,75000,50000 రూపాయల నగదు బహుమతులు అందజేస్తున్నామన్నారు.టోర్నీలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారుడికి, క్రీడాకారిణికి ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ గిరీషా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ పెన్నా భాస్కర్,కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీధర్,డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ మోహన్,హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.