విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరులకు ఘన నివాళులు - రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసులు

 విశాఖపట్నం, నవంబరు 10, టుడే న్యూస్ : రాష్ట్ర అటవీ సంపదను పరిరక్షించుకోవడం ప్రతి

ఒక్కరి భాద్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ , సైన్సు మరియు టెక్నాలజీ

శాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర అటవీ అమర

వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ప్రాణాలర్పించిన రాష్ట్ర అటవీ

అమరులకు అశ్రునివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి

మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐ.ఎఫ్.ఎస్. అధికారి శ్రీ శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రంలో

చందన స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అశువులు బాసిన నవంబరు 10వ తేదిన

ప్రతి సంవత్సరం అటవీ అమర వీరుల దినోత్సవం జరుపుకోవడం

జరుగుతుందన్నారు. అటవీ శాఖ అధికారులు తమ ప్రాణాలను ఫణంగా

పెడుతూ అటవీ సంపదతో పాటు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు .

విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అధికారుల కుటుంబాలకు

ప్రభుత్వ పరంగా అందవలసిన చర్యలను సత్వరమే చేయుటకు గుంటూరులో

ప్రత్యేక విబాగాన్ని ఏర్పాటు చేయడం తెలిపారు.

ఇ.ఎఫ్.ఎస్.అండ్ టి. కార్యదర్శి విజయ కుమార్ ఐ.ఎ.ఎస్.

మాట్లాడుతూ అడవులను పరిరక్షించుటతో పాటు పర్యావణాన్ని పరిరక్షించణ

చెయడం వలన కాలుష్యం నివారించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో

నాలుగవ వంతు అటవీ ప్రాంతం ఉందన్నారు. నాగరికత ప్రారంభమైన రోజుల్లో


కూడా ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించేవారన్నారు. పకృతిని పరిరక్షించే

అవకాశం అటవీ శాఖ అధికారులకు ఉందన్నారు.

ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్.ఎస్. మురళి మాట్లాడుతూ అటవీ

శాఖ అధికారులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను

నిర్వహిస్తున్నారని అన్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సుభద్ర మాట్లాడుతూ అటవీ శాఖ

అధికారులు అడవుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అదే

విధంగా ఏజెన్సీ మారుమూల ప్రాంతాలకు రహదారులు లేక వైద్యం కోసం

గిరిజనులు డోలీలు సహాయంతో ఆసుపత్రులకు వస్తుంటారని, ఏజెన్సీ అటవీ

ప్రాంతాలలో రహదారులు వేసేందుకు అనుమతులివ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, వి.ఎం

.ఆర్. డి.ఎ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల, డి.సి.సి. బ్యాంకు చైర్ పర్సన్

అనిత, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఎన్. ప్రతీప్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్

కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రిటైర్డు అధికారి డా.సి.ఎన్.రావు, డి ఎప్.ఓలు,

కన్జర్వేటర్లు, ఇతర అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*