డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్


విశాఖపట్నం: టుడే న్యూస్,  జనవరి:-27
పేదల వైద్యుడిగా, పోలియో వ్యాధి బాధితుల పాలిట ఆత్మబంధువుగా పేరు గాంచిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారం లభించడం మన తెలుగు వారందరికీ గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు ఇటివల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరావును ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారని మంత్రి కొనియాడారు. పోలియో ఆపరేషన్స్ లో వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో గర్వించే విషయమని అన్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయనకు దక్కిన పద్మ పురస్కారం మొత్తం వైద్యరంగానికే వచ్చిన గుర్తింపు అని మంత్రి అన్నారు. ఓపక్క వైద్య వృత్తితోపాటు మరోపక్క వైద్య రంగంలో విద్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత మంది పేద ప్రజలకు వైద్యం అందించాలని మంత్రి అభిలషించారు. ఈ సందర్భంగా సుంకర వెంకట ఆదినారాయణ రావు దంపతులను మంత్రి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు