ఘనంగా శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు



*సీఎం రాకతో ప్రత్యేక శోభ సంతరించుకున్న వేడుకలు 

*దేశసంరక్షణార్ధం నిర్వహిస్తున్న రాజశ్యామలా యాగంలో పాల్గొన్న సీఎం జగన్‌ 

 విశాఖపట్నం,టుడే న్యూస్ : శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో  ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు.  ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖకు చేరుకుని రోడ్డుమార్గంలో ముషిడివాడలోని శారదాపీఠానికి చేరుకున్నారు. ప్రతి ఏటా మాఘమాసం పంచమి నుండి దశమి వరకు జరిగే ఈ వార్షికోత్సవాలలో భాగంగా మొదటిరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి   వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దేశ సంరక్షణ కోసం నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు.  తదుపరి ఆయన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దాసాంజనేయస్వామి, తాండవమూర్తి తదితర ఆలయాలను దర్శించారు. పండితులు  ముఖ్యమంత్రితో షోడశోపచార పూజలు చేయించారు.  అనంతరం ఆయన చేతుల మీదుగా శంకరాచార్య వేదపాఠశాల విద్యార్ధులకు ఉత్తీర్ణతా పత్రాలు , మెడల్స్‌ బహుకరించారు. సీఎం చేతుల మీదుగా కలశస్థాపన నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాలు  తొలిరోజు గురువందనం, గోపూజతో పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకురార్పణ చేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామలయాగం, నిత్యపీటపూజ పూర్తి అయిన తరువాత శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట టీడీపీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు .

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు