ఏయూ అభివృద్ధికి కృషి చేస్తా : రిజిస్ట్రార్

  

 


రిజిస్ట్రార్ కృష్ణమోహన్ కి సత్కారం

  గంట్లను సన్మానించిన న్యూస్ రీడర్స్

విశాఖపట్నం,  ఫిబ్రవరి 8 టుడే న్యూస్ఆంధ్రాయూనివర్సిటీ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తాజాగా మరోసారి రిజిస్ట్రార్ నియమితులైన కృష్ణమోహన్ అన్నారు. ఈ మేరకు బుధవారం సింహాచలం దేవ స్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కృష్ణమోహను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాదొడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, నూతన ప్రాజెక్టులు, కొత్త పరిశోధనలకు అపార అవకాశాలు, త్వరలో అందుబాటులోకి రానున్న మరిన్ని వసతి, కోర్సుల సదుపాయాలకు సంబంధించి కృష్ణమోహన్ ప్రస్తావించారు. ఎంతో మంది విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లోకి నిలబెట్టిన ఘనత ఒక్క ఆంధ్రాయూనివర్సిటికే దక్కుతుందని శ్రీనుబాబు కొనియాడారు.

గంట్లకు సన్మానం:

ఇటీవలే రెండోసారి జాతీయ స్థాయి జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా నియమితులైన వైజా జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబును బుధవారం నగరానికి చెందిన పలువురు న్యూస్ రీడర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తనను ఆదరించి అభిమానించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అందరి ఆశీస్సులతోనే తాను జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు నాయకత్వం వహించే అవకాశం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూస్ రీడర్లు కృష్ణవేణి, జ్యోతి, సుజాతామూర్తి, కిరణ్మయి తో పాటు ఆన్లైన్ ఎడిటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా వీరంతా శ్రీనుబాబుకి సింహాద్రినాధుడి జ్ఞాపికను బహుకరించారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం