కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ 4 నుంచి ప్రారంభం.-పోస్టర్ విడుదల చేసిన ఎంపీ ఎంవీవీ

వైజాగ్ ఆర్థిస్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ (వాక్ట్) పేరుతో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ది ఫ్రెండ్స్ కప్  కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ వివరాలతో కూడిన వాల్ పోస్టర్ ను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గురువారం ఉదయం లాసన్స్ బే కోలనీ లోనున్న ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ సంగీతం, గానం, సాహిత్యం, నాటకం, నృత్యం తదితర అంశాలకు చెందిన కళా కారుల ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహద పడతాయన్నారు. నిర్వాహకులు ఆర్. గణేష్, ఆర్. యాద కుమార్ లు మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జ్ఞానాపురం జూబ్లీ స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న కళాకారుల క్రికెట్ పోటీల్లో స్త్రీలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, వేమూరి భాస్కరాచారి, పినాకీల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*