విశాఖ నగర మేయర్, కమిషనర్ కి వినతి పత్రం అందించిన: కె కె రాజుగారు

 విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్క్యాప్ చైర్మన్  కె కె  రాజు, విశాఖ నగర మేయర్ శ్రీమతి గొలగాని వెంకట హరికుమారి ని, జివిఎంసి కమిషనర్  లక్ష్మీషా ని కలిసి ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు, వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం వినతిపత్రం అందించారు.ముఖ్యంగా సీతమ్మధార నుంచి పోర్ట్ క్వార్టర్స్ మీదుగా మాధవధార మారిట్ హోటల్ వరకు గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం,బర్మా క్యాంప్ ఫైర్ స్టేషన్ వెనక మాణిక్యమ్మ కాలనీ వరకు రోడ్డు నిర్మాణం, రాంజీ ఎస్టేట్ 60 పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపా హనుక్,అల్లు శంకరరావు,స్టాండింగ్ కమిటీ మెంబర్లు వి.ప్రసాద్,శశికళ, కార్పొరేటర్లు ఆళ్ళ లీలావతి&శ్రీనివాసరావు,పి.ఉషశ్రీ,కె.కామేశ్వరి,రెయ్యి వెంకటరమణ,చల్లా రజిని&ఈశ్వరరావు,48వార్డు ఇంచార్ నీలి రవి తదితరులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం