పంచదార్ల పుణ్య క్షేత్రంలో కంకర దొంగలను కఠినంగా శిక్షించాలి..
" హిందూ సంఘాలు డిమాండ్ ''
రాంబిల్లి: విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వెలసి యున్న కొండపైన శివ దైవ క్షేత్రం, చారితాత్మక పుణ్య క్షేత్రం పంచదార్ల కొండను త్రవ్విన ఆన వాళ్ళను ఆదివారం హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. ఎవరి అనుమతులు లేకుండా గర్భ గుడిని ఆనుకొని వెనక వైపు బుగర్భ జలాల్ని తవ్వి అక్కడ టన్నుల కొద్దీ కంకరని తీసి బయటకు పంపించి వేశారు. అలాగే గర్భ గుడిలోనికి వీలే జలాన్ని తవ్వేశారు. పురాతనమైన సంపదను అధికారం దాహంతో ఇలా చేయడం సబబు కాదని హిందూ సంఘాలు డిమాండ్ చేసాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి అక్రమాలు జరిగినా చూసి చూడనట్టుగా వదిలివేసిన అధికారులు ఎం.ఆర్.వో, డిటి, వి.ఆర్.ఓ అలాగే దేవాలయ ఈవో ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. దీని వెనుక అధికారుల హస్తం ఉందని అనుమానం కలుగుతుందని అని అన్నారు. పంచదార్ల ఊరికి ఆనుకుని ఉన్న కొండ మీద ఏలాంటి కార్యక్రమం చేసిన లోకల్ గా ఉన్న అదికారులకు తెలుస్తుంది. అలాగే ఎండోమెంట్ డిపారర్ట్మెంట్ అధికారులు పర్యవేక్షణ కూడా విధి నిర్వహణ లో భాగంగా పెట్రోలింగ్, పర్యవేక్షణ ఉంటుంది. కానీ మీడియా కి తెలిసిన తరువాత అధికారులు స్పందించడం కరెక్ట్ కాదని అలాగే అధికారులు పాత్ర కూడా ఇందులో ఉందని స్పష్టం గా అర్ధమవుతుంది. దీనిమీద కలెక్టర్ అధ్యక్షతన త్రిసభ్య కామెటీ వేసి కొండ ను కంకర కోసం తవ్విన వ్యక్తులను వారికీ సహకరించిన అధికారులపై తక్షనమే చర్యలు తీసుకోవాలని రానున్న రోజుల్లో దీనిమీద ఆందోళన నిరహిస్తామని, పంచదార్ల కొండ కి 1000 ఏళ్ళ చరిత్ర ఉందని, అలాంటి సంపదని నిర్లక్ష్యం గా కోల్లగొట్టడం చాలా దారుణమని అందులో ఎండోమెంట్ మరియు రెవిన్యూ అధికారుల హస్తం కూడా ఉండి ఉంటుందని అనుమానాలు కలుగుతున్నాయాన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రయా స్వయం సేవక్ మరియు సమరత సేవ ఫౌండేషన్ కన్వీనర్ పడాల శ్రీరాములు, యలమంచిలి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు, రాష్ట్ర బిజెపి సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు, బిజెపి కిషన్మోర్చా రాష్ట్ర కార్యదర్శి ధర్మాల గోవింద రెడ్డి అచ్యుతాపురం మండల అధ్యక్షుడు రాజన రాజు, అనకాపల్లి మైనారిటీ మోర్చా అధ్యకహుడు ఇబ్రహీం బాషా, యలమంచిలి అధ్యక్షుడు పిట్టా దాసుబాబు, పప్పు ఈశ్వరవు, నక్క శివ శంకర్, నాగుమంత్రి శ్రీనివాస్, నూకరాజు, ఓరుపుల జైశంకర్, మహిళా నాయకులు ఎం.ధనలక్ష్మి, జనసేన పార్టీ రాంబిల్లి మండల అధ్యక్షుడు పప్పల నూకన్నా దొర తదితరులు ముఖ్యలు పాల్గొని నిందుతుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.