అణు ఆయుధాలతోనే థర్డ్‌ వరల్డ్‌ వార్‌.. రష్యా సంచలన వ్యాఖ్యలు

 




మాస్కో: ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే అది అణ్వాయుధాలు, విధ్వంసక ఆయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ అభిప్రాయపడ్డారు. మరో ప్రపంచ యుద్ధం అణు యుద్ధమే అవుతుందని బుధవారం అల్‌జజీరా ఇంటర్వ్యూలో చెప్పారు. తమ ప్రత్యర్థి దేశం ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు పొందడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ అణ్వాయుధాలు దక్కించుకోకుండా నిరోధించడం కోసమే తాము ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌ చేపట్టామని వివరించారు. ఉక్రెయిన్‌ను నిరాయుధీకరణ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్‌తో రెండు దఫా చర్చలకు రష్యా సన్నద్ధంగా ఉందని లావ్రోవ్‌ ఉద్ఘాటించారు. అమెరికా ఆదేశాల వల్లే ఈ చర్చల ప్రక్రియను ఉక్రెయిన్‌ వాయిదా చేస్తోందని ఆరోపించారు.  

మరోవైపు రెండు దేశాల ఎదురు దాడుల్లో రష్యా సైనికులు, ఉక్రెయిన్‌ తరఫున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్‌ చేసిన రష్యన్‌ బలగాలు ఖార్కీవ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం