*కాకనందివాడ'దేవత' కాకినాడనూకాలమ్మ*


విక్టోరియా వాటర్ వర్క్స్ చెరువు త్రవ్వకాల్లో బంగారు ముక్కెరతో బయల్పడిన ప్రతిమ..

(శుభకృత్ ఉగాది సందర్భంగా ప్రత్యేక వ్యాసం..

1909లో విక్టోరియా వాటర్ వర్క్స్ చేపట్టిన కాకినాడ కుళాయి చెరువు త్రవ్వకాలు జరుగుతుండగా నదీ గర్భంలో గునపం మొనకు తగిలిన నూకాలమ్మ తల్లి రాతిప్రతిమ బంగారు ముక్కెరతో అదిమివున్న మట్టిపెళ్ళ  వెలుగు చూసింది. వళ్ళు గుగుర్పొడిచిన ఆ సంఘటన పిఠాపురం రాజా కి తెలిసి అక్కడి నాలుగు రోడ్ల కూడలిని ఆనుకుని వున్న స్థలాలను గ్రామ దేవత ఆలయం కోసం ఏర్పాటు చేశారు. ఆలయం వెనుక రామారావు పేట (పిఠాపురం రాజా వారి తండ్రి గంగాధర రామా రావు బహుదూర్ పేరు) ఆలయం ముందు సూర్యారావు పేట (రావు మహీపతి వెంకట సూర్యారావు బహుదూర్ పేరు) ముఖ ద్వారం ఎదురుగా రేచర్ల పేట( పిఠాపురం రాజా వారి గోత్రం రేచర్ల) రైల్వే గేటు మార్గం వుంటుంది. జగన్నాధపురం పాత కాకినాడ కాగా.. కొత్త కాకినాడ ప్రాంతంగా ఆనాడు ఇక్కడి ప్రాంతం జిల్లా ప్రసిద్ది.. ఆ మేరకు కొత్తకాకినాడ నూకా లమ్మతల్లి గా పేరొం దింది. నూకాలమ్మ సేవకు జాతర మాసంలో ఇతోధికంగా వారి ఇండ్లల్లో ఇంటి ఆడపడుచుగా పూజిస్తూ పాన్పులు వేసి కొలుచుకున్న  మహనీయులు ఎంతో మందివున్నారు. రాతి ప్రతిమతో బాటుగా బయల్పడిన బంగారు ముక్కెర వెనుక అనేక ఇతిహాసాలున్నాయి. కాకినాడ ఫ్రెంచ్ డచ్ వారు పాలించడానికి ముందు పూర్వ కాలం 17వ శతాబ్ధారంభంలో కాకనందివాడ వంశీయు లు పాలించిన చరిత్ర. ఆ వంశీయులు అప్పటి రోజుల్లో ఇక్కడి అడవి మార్గంగా దట్టమైన వృక్ష సముదాయం వున్న ప్రదేశంలో ప్రతి ఏటా దేవతారాధనకు ఇంటి ఆడపడుచులతో వచ్చే వారని అప్పటి ఆరాధనలో ముక్కెరలు విధిగా ధరించేవారని  ప్రధాన ఆడపడుచు ప్రయాణంలో ముక్కెర  పోగొట్టుకున్న దృష్టాం తంతో బాటుగా వారు వెంట తెచ్చుకుని పూజించే దేవత ప్రతిమ అంతర్ధానమయ్యిందని  ఆ తరుణం నుండే కాకనందివాడ వంశీ యుల కాలం అంతరిం చడం ఆరంభమయ్యిం దని పేర్కొంటారు. ఇది పూర్వీకులు మాట్లాడు కున్న మూలవిరాట్ చరిత్ర కథనం. ఇప్పటికీ ఇక్కడి నూకాలమ్మతల్లి విగ్రహానికి అమర్చే ముక్కుపుడక బహు అపురూపమైనది. ఆ ముక్కెర తీయడం పెట్టడంలో తిథి వార నక్షత్రాలు అనుకూలంగా లేకుంటే అనేక కాల మాన దోష అనర్థాలు సంభవిస్తుంటాయని ఆధ్యాత్మిక ప్రసిద్దులు తెలిపే ఉవాచ. చరిత్ర కాలగమనంలో ఆలయ నిర్వాహణ వేలం పాట ల్లో పెరిగిన భక్తులఆర్థిక అవస్తలపై సూర్యారావు పేట యువత 1989లో కన్నెర్ర జేసి ఆలయా న్ని 1990 లో ఎండో మెంట్స్ నిర్వహణలోకి తీసుకువచ్చింది. గ్రామదేవతకు అనాదిగా '' బడే " కుటుంబం ఆడపడుచులు నిత్య ధూప దీప షోడశోప చార పూజాధికాలు నిర్వహిస్తారు. ముక్కెర ధరించి దర్శించే ఆడపడుచులకు కల్పవల్లిగా కాకినాడ కొత్తపేట నూకాలమ్మ తల్లి అనుగ్రహిస్తుం దనేది ఆధ్యాత్మికపరు ల్లో వున్న ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం కాకినాడ రైల్వే స్టేషన్ కు అతిదగ్గరలో, ఆర్ టి సి కాంప్లెక్స్ కు సమీపంగా వున్న టుటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో, కుళాయి చెరువు రాజాట్యాంక్ పార్కు వద్ద నాలుగు రోడ్ల కూడలి లో వుంది.ఆలయం అతిచిన్నయి నా కాకినాడ వాసులు ఇక్కడి నూకాలమ్మను దర్శించకుండా స్మరించకుండా ఎటువంటి ప్రయాణాలు చేపట్టరన్నది అతిశయోక్తి కాదు.ఉగాది ముందు రోజురాత్రి జాతర, మరునాడు ఉత్సవ వేడుక జరగడం ఇక్కడి సంప్రదాయం. 1866లో  ఏర్పడిన 156 వసంతా ల కాకినాడనగరానికి వన్నె తరగని ముక్కెరగా, గలగలా పారే ధన ధన డప్పుల నడుమ గరగల మువ్వల సవ్వడితో  ఏటేటా 113 సంవత్సరాల చారిత్రాత్మక భాగ్యసిద్ధియై వర్ధిల్లుతోంది!! కాకనంది వాడ వంశీయుల మూల విరాట్ ప్రతిమా దేవత శ్రీనూకాలమ్మ!!

- *దూసర్లపూడి రమణరాజు, ఆధ్యాత్మికవేత్త కాకినాడ*

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు