*ఒక నటుడి లోని నటన ని వెలికితీయగల సమర్ధవంతమైన దర్శకుడు దొరికితే ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించబడిన చిత్రం*


 RRR. రామచరణ్  నట విశ్వరూపానికి తార్కాణం RRR.  సహనటుల్ని అందులోను జూ ఎన్టీఆర్ లాంటి ప్రూవ్డ్ యాక్టర్స్ ని కూడా డామినేట్ చేసేసి ఇది మల్టీ స్టారర్ ఆ ? కాదా అన్న అనుమానం న్యూట్రల్ ప్రేక్షకులకు   కలగకమానదు. రాంచరణ్ సినిమా అంతా తనే అయ్యి భుజాల కి ఎత్తుకుని నడిపించిన సినిమా RRR. ఆహార్యం లో కానీ , నటన లో కానీ, ఫైట్స్ లో కానీ 100 కి 100 శాతం మార్కులు కొట్టేశాడు. రామ్ చరణ్ నట జీవితం లో RRR కి ముందు తర్వాత అనేటట్టు ఈ సినిమా ఉంది

 RRR తర్వాత రాబోయే సినిమా దర్శకుల మీద విపరీతమైన వత్తిడి ని పెట్టేసినట్టే. తెలుగు సినిమా ఈ తరం మెగాస్టార్ అనటం లో ఎటువంటి సందేహం లేకుండా చేసిన సినిమా RRR. పౌరాణిక పాత్రలని కూడా మెప్పించగలడు రాంచరణ్  అని ఈ సినిమా నిరూపించింది , రాజమౌళి కనక భవిష్యత్తు లో మహాభారతం తీసే ఉద్దేశ్యం ఉంటే మెయిన్ కాస్టింగ్ కి ఢోకా లేదు 

కథ కి కథనానికి సినిమా కి ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు రాజమౌళి, మల్టీ స్టారర్ అందులోను ఇద్దరు అగ్రనటులతో, తీసిన సినిమా. ఇద్దరు హీరో లని బాలన్స్ చెయ్యాలి ..హీరో ల ఇమేజ్ లని దృష్టిలో పెట్టుకోవాలి , అభిమానుల ఘర్షణ లేకుండా చూసుకోవాలి లాంటివేమి పెట్టుకోకుండా కథ కి తగ్గట్టు ఏ పాత్ర కి ఎంత న్యాయం చెయ్యాలో అంతే చేసేట్టు మొత్తం తీర్చిదిద్దారు. ఎమోషనల్ డ్రామా లో కింగ్ అయిన రాజమౌళి మరొకసారి తన మార్కు చూపించారు. భారీతనం అంతా 

కొట్టొచ్చినట్టు కనపడింది. పాటలు సినిమా కి అడ్డం అనుకున్నట్టు ఉన్నారు

రాజమౌళి తో ఉన్న అనుబంధం వలన కావొచ్చు , రామ్ చరణ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ వలన కావొచ్చు ..లేదా ఈ కథ కి తనకి ఇచ్చిన పాత్ర పరిధి అంతే అవ్వటం మూలానో, జూ ఎన్టీఆర్ (భీమ్)  కొంత రామరాజు నీడలోనే ఉండాల్సి వచ్చింది. భేషజం లేకుండా తను నటించడం తెలుగు సినిమా కి శుభ పరిణామము. సోలో షాట్స్ ఉన్నప్పుడు తన పాత్ర మేరకు నటించినా , రామ్ చరణ్ తో ఉన్న కాంబినేషన్  సీన్స్ అన్నిటిలోను రాంచరణ్ ఆదేశాలు పాటించే/లేదా అనుసరించే  సపోర్టింగ్ యాక్టర్ గా జూ ఎన్టీఆర్ నటన తప్పు పట్టలేనట్టు గా కొనసాగింది. తన ఫాన్స్ కి కొంత నిరుత్సాహం కలిగించే అంశం అయినప్పటికీ , ఎన్టీఆర్ మెచూరిటీ ని అభినందించకుండా ఉండలేము

ఉన్న ఇద్దరు హీరోలకే సినిమా ప్రెజన్స్ సరిపోక పోవడం వలన కావొచ్చు , హీరోయిన్లకి పెద్ద ప్రాధాన్యం లభించలేదు. ముఖ్యంగా హిందీ నుంచి తెచ్చిన అలియా కి కానీ , శ్రేయ కి కానీ. కాస్తో కూస్తో ఆంగ్ల తార ఒలీవియా స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనపడ్డారు.  ఫ్లాష్ బాక్ లో వచ్చిన అజయ్ దేవగణ్ మార్కులు కొట్టేశాడు. మిగతా అంతా వచ్చిపోయే యాక్టర్లే

మొత్తం మీద R (రామ్ చరణ్) R (రాజమౌళి) R (రామారావ్) ల సుదీర్ఘ నిరీక్షణ , కష్టం అనుకున్న ఫలితాలనే ఇచ్చింది 

వచ్చే పదేళ్ళలో రామ్ చరణ్ దగ్గరకి కూడా ఇంకెవరు రాకుండా చేసిన సినిమా RRR.

Rating 4.25/5

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం